![]() |
![]() |

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy ) స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో బుధవారం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నారాయణమూర్తి ఆసుపత్రిలో చేరారన్న వార్తతో అభిమానులు ఆందోళన చెందారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆరోగ్యం ఆరా తీశారు. అయితే నారాయణమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని ఇప్పటికే సన్నిహితులు వర్గాలు చెప్పాయి. తాజాగా ఆయన పూర్తిగా కోలుకొని, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఆసుపత్రి సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. "దేవుడి దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప గారికి, అక్కడ డాక్టర్స్ కు సిబ్బందికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. నా క్షేమాన్ని కోరుకుంటున్న ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్నా." నారాయణమూర్తి అన్నారు.
![]() |
![]() |