![]() |
![]() |

ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం అనేది కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) విషయంలో అదే జరగబోతుందని తెలుస్తోంది. ఒక హీరో చేయాల్సిన ఓ భారీ పాన్ ఇండియా సినిమా.. విశ్వక్ ని వెతుక్కుంటూ వచ్చినట్లు సమాచారం.
నాలుగేళ్ల క్రితం నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' (Powerpeta) అనే సినిమా ప్రకటన వచ్చింది. ఈ పాన్ ఇండియా మూవీని భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ బడ్జెట్ లేదా ఏవో ఇతర కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత కృష్ణ చైతన్య డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఒక మూవీ లాంచ్ అయ్యి, ఏవో కారణాలతో అది కూడా ఆగిపోయింది. అప్పుడది 'పవర్ పేట' చిత్రమే అని ప్రచారం జరిగింది. శర్వాతో ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడంతో.. 'పవర్ పేట'ను పక్కన పెట్టి, విశ్వక్ సేన్ తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే మూవీ చేశాడు కృష్ణ చైతన్య. ఈ ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్ లో 'పవర్ పేట' రూపుదిద్దుకోనుందని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుందట.
![]() |
![]() |