![]() |
![]() |

శంకర్ (Shankar) దర్శకత్వంలో చేస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) మూవీ షూటింగ్ ని ఇటీవల పూర్తిచేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తన తదుపరి చిత్రాన్ని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా.. కీలక పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.
శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) పుట్టినరోజు(జూలై 12) సందర్భంగా 'RC 16' మేకర్స్ కీలక ప్రకటన చేశారు. శివన్నకు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శివ రాజ్‌కుమార్ కి మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన గతంలో తెలుగులో 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో గెస్ట్ రోల్ లో మెరిశారు. ఇప్పుడు 'RC 16' లాంటి భారీ ప్రాజెక్ట్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. చరణ్-శివన్న కాంబినేషన్ బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ చేస్తుంది అనడంలో సందేహం లేదు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |