![]() |
![]() |
.webp)
ప్రతీవారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తూ ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అలాగే ఓటీటీలోకి కొన్ని సినిమాలు వచ్చి హిట్ అవుతున్నాయి. అయితే వీటిలో ఫ్యామిలీతో కలిసి చూసే కొన్ని వెబ్ సిరీస్ లు ఏంటో ఓసారి చూసేద్దాం.
ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ :
సంగీత్ శోభన్ హీరోగా సిమ్రన్ శర్మ హీరోయిన్ గా నరేష్, తులసి, గెటప్ శీను ప్రధాన పాత్రలుగా నటించిన వెబ్ సిరీస్ ఇది. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 లో వచ్చింది. ప్రతీ మధ్యతరగతి కుటుంబంలో ఉండేలాగే ఈ సిరీస్ లో ఉంటుంది. అయితే తండ్రి తీసుకున్న లోన్ ని తెలుసుకున్న కొడుకు ఎలా దాన్ని తీర్చగలిగాడు. అసలు భాద్యతలు తెలియని కొడుకుకి ఇన్నోసెంట్ గా ఉండే అమ్మ జత కూడగా.. వారి మధ్య జరిగే సంభాషణలు కడుపుబ్బా నవ్విస్తాయి. దీనిని ఫ్యామిలీతో కలిసి చూసేలా అడల్ట్ సీన్లు లేకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.
.webp)
సేవ్ ది టైగర్స్ :
గతేడాది మార్చి నెలలో ఫస్ట్ సీజన్ విడుదల అవ్వగా.. ఈ ఏడాది సెకెండ్ సీజన్ రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ వెబ్ సిరీస్. ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, రోహిణి, గంగవ్వ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సిరీస్ ని తేజ కాకమాను దర్శకత్వం వహించాడు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు, ఒకరిపై ఒకరు ఫన్నీగా ప్రతీకారం తీర్చుకునే పాయింట్ తో క్రియేటర్స్ మహి.వి. రాఘవ, ప్రదీప్, దర్శకుడు తేజ కాకమాను తెరకెక్కించిన ఈ సిరీస్ అత్యధిక వీక్షకాధరణ పొందింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ తీసారు. అభినవ్ గోమఠం-రోహిణి మధ్య సాగే సంభాషణలు, ప్రియదర్శి-జోర్దార్ సుజాల మధ్య వచ్చే సీన్లు.. ఇలా ఒక్కటేంటి ఈ సిరీస్ లో ప్రతీ ఎపిసోడ్ హాస్యాన్ని పండించింది. మధ్యతరగతి కుటుంబంలో ఉండే చిన్న చిన్న గొడవల నుండి కామెడీని జనరేట్ చేసి నవ్వుకునేలా మేకర్స్ తీసారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉంది.
.webp)
90's :
ఈ సిరీస్ ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది. ఆదిత్య హాసన్ దర్శకుడు. శివాజీ, వాసుకి , మౌళీ, వాసంతిక, రోహన్ రాయ్, స్నేహల్ ఫ్రధాన పాత్రలుగా నటించిన ఈ సిరీస్ 90's లో పుట్టిన వారికి బాగా కనెక్ట్ అవుతుంది. అప్పట్లో స్మార్ట్ ఫోన్ లు ఉండేవి కావు. ఒకరినొకరు పలకరించుకోవాలంటే ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు తప్ప వేరే మార్గం లేదు. ఇక ఇంటికి చుట్టాలొస్తే ఓ పండగే. నాన్న భయం ఓ వైపు, అమ్మ గారాభం ఓ వైపు.. ఇలా ఎన్నో జ్ఞాపకాలని మరోసారి గుర్తుకుతెచ్చేస్తుంది ఈ సిరీస్. ఓ మధ్యతరగతి తండ్రి పిల్లల కోసం పడే ఆవేదన, పిల్లల ర్యాంకుల కోసం ప్రైవేట్ స్కూల్స్ చేసే ఒత్తిడి, ఇంట్లో ఖర్చులని తగ్గిస్తూ అమ్మ చేసే ఉప్మా, చిన్నకొడుకు చేసే అల్లరి.. ఇలా చెప్పుకుంటు పోతే ఇది వెబ్ సిరీస్ లా అనిపించదు. అన్నీ జ్ఞాపకాలు, అనుభవాలే. ఫ్యామిలీతో కలిసి చూసే ఈ సిరీస్ ని మిస్ అవ్వొద్దు.
![]() |
![]() |