![]() |
![]() |

జాన్వీ కపూర్(janhvi kapoor)అతిలోక సుందరి శ్రీదేవి(sridevi)నట వారసురాలిగా 2018 లో దఢక్ అనే మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత రోహీ, గుడ్ లక్ జెర్రీ, బావల్, మిస్టర్ అండ్ మిస్సెస్ మహి,మిల్లి వంటి చిత్రాల్లో నటించి తనెంత వాల్యుబుల్ నటినో చెప్పింది. ప్రస్తుతం ఉలజ్( ulajh)అనే మూవీ చేస్తుంది. ఆ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో జాన్వీ కపూర్ ప్రధాన పాత్రగా ఉలజ్ తెరకెక్కుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. సుహానా అనే ఒక అటవీ అధికారిణి గా ఒక పవర్ ఫుల్ రోల్ లో జాన్వీ కనిపించనుంది. రీసెంట్ గా జాన్వీ లుక్ ఒకటి విడుదల అయ్యింది.స్వయంగా జాన్వీ నే తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. కంప్లీట్లీ అధికారిణి గెటప్ తో ఉన్న ఆ లుక్ ఇప్పుడు పలువుర్ని ఆకర్షిస్తుంది. అదే విధంగా ప్రతి ముఖం ఒక కథ చెప్తుంది. చెప్పే ఆ ప్రతి కథ మనల్ని ఉచ్చులో పడేస్తుందనే వ్యాఖ్యలని జోడిచ్చింది. దీంతో అందరిలోను మూవీ మీద క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ లోని డైలాగ్ లు కూడా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశాలు, వాటి సరిహద్దులు ఇసుకలో గీసిన గీతాల్లాంటివి, వాటికి ఎలాంటి విలువ ఉండవని చెప్పారు.

వచ్చే నెల 2 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతున్న ఉలజ్ లో జాన్వీ తో పాటు గుల్షన్ దేవయ్య, రాజేష్ తైలాంగ్ కీలక పాత్రల్లో చేస్తున్నారు. జంగ్లీ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్ నిర్మిస్తుండగా సుదాంషు సరియా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గతంలో ఆ టైట్ స్పాట్, హిస్ న్యూ హాండ్స్, నాక్ నాక్ నాక్, సనా వంటి విభిన్నమైన సినిమాలకి దర్శకత్వం వహించాడు. మరికొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
![]() |
![]() |