![]() |
![]() |

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అనే సామెత ఒకటి ఉంది. ఇప్పుడు అది ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్(trivikram)కి పర్ఫెక్ట్ గా సూటవుతుంది. తన నెక్స్ట్ సినిమాకి ఏ విధమైన పంచులు ఉండాలో అని రాసుకుంటూ ఉన్న ఆయనకి ఒక పంచ్ హాయ్ చెప్తుంది. మరి దాన్ని ఆయన పలకరించాడో లేదో తెలియదు గాని, అశేష ప్రేక్షకులని మాత్రం పలకరించే పనిలో బిజీగా ఉంది.
పూనమ్ కౌర్(poonam kaur)సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా ఫేమస్. బహుశా సోషల్ మీడియా కూడా తన కోసమే పుట్టిందనుకుంటా.ఆమె యూజ్ చేసే విధానం చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. అసలు పూనమ్ పేరు తియ్యగానే అందరి మెదళ్లలో పవన్(pawan kalyan)త్రివిక్రమ్ ల పేర్లు ఆటోమాటిక్ గా కదులుతూ ఉంటాయి.అంతటి ట్రాక్ రికార్డుని తన ఖాతాలో భద్రపరుచుకుంది.వీలు లేకపోయినా చేసుకొని మరి పవన్, త్రివిక్రమ్ మీద తన దైన శైలిలో కామెంట్స్ చేస్తుంది. అవి సంచలనానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంటాయి. కాకపోతే పవన్ మీద అంత నెగిటివ్ గా మాట్లాడదు. కానీ త్రివిక్రమ్ మీద మాత్రం ఒక రేంజ్ లో కామెంట్స్ చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej)గత మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా చిన్న పాటి యుద్ధమే చేస్తున్నాడు. ఇనిస్టాగ్రమ్ లో అసభ్యకర డిస్కస్ చేసిన ప్రణీత్ హన్మంతు అనే ఓ యూట్యూబర్ పని పట్టే వరకు వదలలేదు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ, మహిళా కమిషన్ స్పందించడంలో తేజ్ పాత్ర ఎంతో ఉంది. దీంతో తేజ్‌ను రియల్ లైఫ్ హీరో అని అందరు పొగుడుతున్నారు. అయితే కొంత మంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇప్పుడు ఈ విషయంలోనే పూనమ్ కౌర్ త్రివిక్రమ్ కి కౌంటర్ వేసింది. అదేంటి ఈ మ్యాటర్ మొత్తంలో ఎక్కడ కూడా త్రివిక్రమ్ లేడు కదా! మరి కౌంటర్ వేయడం ఏంటి అని అనుకుంటున్నారా. ఇక్కడే ఉంది అసలు విషయం .తేజ్ ని టార్గెట్ చేసిన వ్యక్తి పవన్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా(jalsa)లోని ఒక సీన్ ని టాగ్ చేసాడు.పడుకుని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమోస్తుందని బ్రహ్మ్మనందం తో పవన్ అంటాడు. ఇలాంటి సీన్స్ వల్లే యూత్ చెడిపోతోందని, ముందు వీళ్ల మీద చర్యలు తీసుకోవాలంటూ సదరు నెటిజన్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్‌కి పూనమ్ రిప్లై ఇచ్చింది. డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు. అంత కంటే ఎక్కువగా కూడా ఆశించొద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు అయితే త్రివిక్రమ్‌తో మీకున్న సమస్య ఏంటని పూనమ్ ని అడుగుతున్నారు. కానీ పూనమ్ మాత్రం ఎప్పటిలాగానే ఆ ఒక్కటి అడక్కండి అనే రీతిలో నో రిప్లై . జల్సా సినిమాతోనే పూనమ్ కౌర్, త్రివిక్రమ్‌ల మధ్య గొడవ స్టార్ట్ అయ్యిందనే టాక్ ఐతే ఉంది.
![]() |
![]() |