![]() |
![]() |
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా, మరెంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో సహజంగానే భారీ హైప్ ఉంది. ఇప్పటికే ‘వార్2’ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘దేవర’ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ కాబోతోంది. అందుకే బాలీవుడ్‌లో ఎన్టీఆర్ మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
షూటింగ్ డిలే అవుతున్న కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే చాలా కాలంగా ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రొడక్షన్ హౌస్‌ను ట్యాగ్ చేస్తూ ‘దేవర’ చిత్రానికి సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఇవ్వాలని నిర్మాతలను కోరుతున్నారు అభిమానులు. సెకండ్ సాంగ్ అయినా రిలీజ్ చెయ్యాలని మేకర్స్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దానికి సమాధానంగా సినిమాకి సంబంధించి కేవలం రెండు పాటలు, వారం రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, అది పూర్తి చేసి త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామని మేకర్స్ తెలిపారు. సినిమా అప్‌డేట్ కోసం ఎంతో టెన్షన్‌తో ఎదురుచూస్తున్న అభిమానులు నిర్మాతలు ఇచ్చిన అప్‌డేట్‌తో రిలాక్స్ అయ్యారు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్న ‘దేవర’ తమ హీరో రేంజ్‌ని మరింత పెంచుతుందని ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.
![]() |
![]() |