![]() |
![]() |

సుధీర్ బాబు (Sudheer Babu), మాళవిక శర్మ జంటగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). జూన్ 14 థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా.. పరవాలేదు అనిపించుకుంది. యాక్షన్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెడుతోంది.
'హరోం హర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జూలై 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకి ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మించిన 'హరోం హర' చిత్రంలో సునీల్, జయప్రకాశ్, అక్షర, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులు నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా అరవింద్ విశ్వనాథన్, ఎడిటర్ గా రవితేజ గిరిజాల వ్యవహరించారు.
![]() |
![]() |