![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) కి ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాత ఏఎం రత్నం( am rathnam)మేకప్ మ్యాన్ గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన ఎన్నో బ్లక్ బస్టర్ సినిమాలని నిర్మించాడు. దర్శకుడి గాను పెద్దరికం వంటి సూపర్ హిట్ సినిమాని అందించాడు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు.దీంతో అందరకి ఒక క్లారిటీ వచ్చింది.ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి అయితే జ్ఞానోదయం అయ్యింది.
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్న విషయం అందరకి తెలిసిందే. వాటిల్లో ఒకటి హరిహర వీరమల్లు(hari hara veera mallu) ఏ ఏం రత్నమే నిర్మాత.పైగా పవన్ నటిస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పవన్ ఎలక్షన్స్ నుంచి ఫ్రీ అయ్యాడు. దీంతో ఇప్పుడు పవన్ వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని, ఓజి,ఉస్తాద్ భగత్ సింగ్ లని పక్కన పెట్టి మరి వీరమల్లు కి డేట్స్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. ఈ మేరకు జులై మొదటి వారంలో షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని కన్ఫార్మ్ అయ్యింది. ఎందుకంటే స్వయంగా ఏ ఏం రత్నమే చెప్పాడు. పవన్ త్వరలోనే జాయిన్ అవుతారు కానీ తనకి ఉన్న బిజీ షెడ్యూల్ నుంచి ఫ్రీ అయ్యాక జాయిన్ అవుతారు. అలాగే పవన్ నటించాల్సిన భాగం కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉందని చెప్పాడు. దీంతో వీరమల్లు కొంచం ఆలస్యంగానే మొదలవుతుందని చెప్పవచ్చు.
.webp)
ఇక స్వయంగా ఏ ఏం రత్నమే జులై లో ఉండదని చెప్పడంతో పవన్ అభిమానులకి చిన్నపాటి జ్ఞానోదయం అయ్యింది.ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ని చాలా మంది అభిమానులు వేరే వాళ్ళతో జులై లో మా పవన్ షూట్ లో పాల్గొంటున్నాడని చెప్పారు. ఇప్పటికే మేజర్ భాగాన్ని పూర్తి చేసుకున్న వీరమల్లు కొన్ని రోజులు షూటింగ్ ని జరుపుకుంటే కంప్లీట్ అవుతుంది. క్రిష్ జాగర్లమూడి స్థానంలో జ్యోతి కృష్ణ(jyothi krishna)దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన ఏ ఏం రత్నం కొడుకే. సో వీరమల్లు షూటింగ్ జులై లో ప్రారంభం కాదని జ్యోతి కృష అనుమతి తోనే చెప్పి ఉంటాడు.
![]() |
![]() |