![]() |
![]() |
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డా. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన నటీనటులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో ప్రముఖుల సమక్షంలో నిర్వహించనున్నారు. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో జూన్ 29న ఈ అవార్డ్స్ ఫంక్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క)కు అవార్డు ఫంక్షన్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.
![]() |
![]() |