![]() |
![]() |
.webp)
ఇళయ తలపతి విజయ్(vijay)కి తమిళనాడు నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కొన్ని కోట్లాది మంది అభిమానులు విజయ్ ఏది చెప్తే అది చెయ్యడానికి రెడీ. ఆ నమ్మకంతోనే పేద ప్రజలకి సేవ చెయ్యడానికి తమిళ మున్నేట్ర కజగం అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. తాజాగా ఆయనకీ సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ఈ రోజు విజయ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన అప్ కమింగ్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం(The Greatest of All Time) అలియాస్ ది గోట్ మూవీ నుంచి వీడియో ఒకటి రిలీజ్ అయ్యింది. కొంత మంది దుండగులు కార్లు బైక్ లు వేసుకొని బైక్ పై వెళ్తున్న ఇద్దరు విజయ్ పాత్రధారులుని వెంటపడుతున్నారు. దాంతో విజయ్ లిద్దరు వాళ్లకి దొరకకుండా చాలా స్పీడ్ గా వెళ్తున్నారు. మొత్తం నలభై ఎనిమిది సెకన్లు ఉన్న ఆ వీడియో చూసి అభిమానులు అయితే ఆనందంతో గంతులేస్తున్నారు. ఈ సారి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అని అంటున్నారు.ఇక వీడియో లో చూసిన దాన్ని బట్టి ఆ ఛేజ్ ని అవుట్ అఫ్ కంట్రీ లో చిత్రీకరించారని తెలుస్తుంది. అదే విధంగా యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ అయితే అదనపు ఆకర్షణ తెచ్చింది. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం అందరకి తెలిసిందే.

విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా ప్రభు దేవా, ప్రశాంత్, మోహన్, జయరాం, స్నేహ, లైలా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు(venkat prabhu)దర్శకుడు కాగా కలాపతి అగోరం, గణేష్, సురేష్ లు కలిసి విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టిన నేపథ్యంలో మూవీలో రాజకీయ పంచులుంటాయేమో చూడాలి. ఎందుకంటే గత కొంత కాలం నుంచి విజయ్ సినిమాల్లో చాలా వరకు పొలిటికల్ పంచ్ లు ఉంటూ వస్తున్నాయి.సెప్టెంబర్ 5 న మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక విజయ్ పుట్టిన రోజు సంబరాలు తమిళనాట చాలా ఘనంగా జరిగాయి. చాలా ఏరియాల్లో అన్నదానాలు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసారు.
![]() |
![]() |