![]() |
![]() |
.webp)
వెబ్ సిరీస్: బ్యాడ్ కాప్
నటీనటులు: అనురాగ్ కష్యప్, గుల్షన్ దేవయ్య, హర్లీన్ సేథీ, సౌరభ్ సచ్ దేవ్
ఎడిటింగ్: జితేంద్ర
సినిమాటోగ్రఫీ: అనిక్ ఆర్ వర్మ్
మ్యూజిక్: విక్రమ్ మాంట్రోజ్
నిర్మాతలు: లీనా టండన్
దర్శకత్వం: ఆదిత్య దత్
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
ముంబై మహానగరంలోని ఓ అనాథాశ్రమంలో కరణ్, అర్జున్ అనే ఇద్దరూ ట్విన్స్ పెరుగుతారు. కొన్ని రోజులకి కరణ్ ని ఒక కుటుంబం దత్తత తీసుకుంటుంది. అలా వెళ్లిన కరణ్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇక అర్జున్ దొంగగా మారతాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. కరణ్ కి దేవిక (హర్లీన్ సేథీ)తో పెళ్లి అవుతుంది. వాళ్లకి 'రియా' అనే ఓ పాప ఉంటుంది. దేవిక కూడా పోలీస్ ఆఫీసర్ గానే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆమెకి ప్రమోషన్ రావడం వలన, కరణ్ కంటే పైస్థాయికి వెళ్తుంది. అది కరణ్ కి కాస్త ఇబ్బంది కలిగిస్తుటుంది. ఆ ఇగో అనేది ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంటుంది. అర్జున్ కి దూరంగా ఉండమని, తమ కెరియర్ ను ఇబ్బందుల్లో పడేయవద్దని కరణ్ కి దేవిక తరచూ చెబుతుంటుంది. కానీ అర్జున్ కి కరణ్ టచ్ లోనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక మర్డర్ కేసులో అర్జున్ చిక్కుకుంటాడు. చనిపోయింది ఆనంద్ మిశ్రా అనే జర్నలిస్ట్. అతని స్నేహితుడైన సీనియర్ పోలీస్ ఆఫీసర్ (సౌరభ్ సచ్ దేవ్) రంగంలోకి దిగుతాడు. దాంతో కంగారు పడిపోయిన అర్జున్, ఓ రాత్రివేళ తన అన్నయ్య కరణ్ ను 'పోర్టు'లో కలుసుకుంటాడు. ఆ కేసు నుంచి తను బయటపడేలా చేయమని కోరతాడు. అదే సమయంలో 'కస్బా' అనుచరులు వారిపై దాడి చేస్తారు. కస్బా ఒక గ్యాంగ్ స్టర్. అతను జైల్లో ఉన్నప్పటికీ, అతనికి సంబంధించిన అక్రమ వ్యాపారాలన్నీ అక్కడి నుండే డీల్ చేస్తాడు. అలాంటి 'కస్బా' అనుచరులను కరణ్ - అర్జున్ ఇద్దరు కలిసి ఎదుర్కుంటారు. ఒకానొక సందర్భంలో ఇద్దరూ గాయపడి సముద్రంలోకి దూకేస్తారు. గాయాలపాలైన కరణ్ హాస్పిటల్లో చికిత్స అనంతరం కోలుకుంటాడు. అతడిని దేవిక ఇంటికి తీసుకుని వస్తుంది. అయితే జరిగిన సంఘటనలో కరణ్ చనిపోయాడని తను హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చింది అరుణ్ ను అని ఆమెకి తెలియదు. దేవిక పోలీస్ ఆఫీసర్ గనుక ఏ క్షణమైనా తాను ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని అర్జున్ భయపడుతుంటాడు. దాంతో ముంబై నుంచి అతను బయటపడే ప్రయత్నంలో ఉండగా, తన అన్నయ్యను చంపింది 'కస్బా' మనుషులు అనే విషయం అర్జున్ కి తెలుస్తుంది. దాంతో వాళ్ళని చంపకుండా తను అక్కడి నుంచి వెళ్లకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అర్జున్ ఏం చేశాడు? కస్బాని పట్టుకున్నాడా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇద్దరు కవలల కథని ఇప్పటికి మనం చాలానే చూశాం. వాలి సినిమాలో అజిత్ డ్యుయల్ రోల్, జీన్స్ లో ఇంకా చాలానే చూశాం అయితే వాటికి ఈ స్టోరీకి సంబంధం ఉండదు. కొత్తగా ముంబైలో సాగే కథ ఇది. కరణ్ అర్జున్ అనే బ్రదర్స్ చుట్టూ సాగే కథ ఇది. ఓ ప్రెష్ ఫీల్ ని కలుగజేస్తూ కథనం సాగుతుంది.
అశ్లీల పదజాలం వాడలేదు.. అడల్ట్ సీన్లు లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. సిరీస్ లో మొదటి ఎపిసోడ్ ని పాత్రలని పరిచయం చేశాడు. ఇక ఎపిసోడ్ చివరన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేశాడు. సెకెండ్ లో గ్యాంగ్ స్టర్ ఎంట్రీ.. అతను జైల్లో ఉండి బయట తన వ్యాపారాన్ని నడిపించే సీన్ బాగుంటుంది. ఇక అటు పోలీస్ ఆఫీసర్ గా ఇటు దొంగగా హీరో అద్భుతమైన నటనతో సిరీస్ పై ఆసక్తిని పెంచేశాడు.
మొదటి ఎపిసోడ్ : కరణ్ యా అర్జున్ ఇందులో ఇద్దరి లైఫ్ స్టైల్ వారి చుట్టు ఉన్న సిచువేషన్ లని పరిచయం చేశాడు దర్శకుడు. ఇక రెండో ఎపిసోడ్ : పహ్ చాన్ కౌన్.. అర్జున్ హాస్పిటల్ నుండి బయటకి వచ్చాక తన తీరు కరణ్ లా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో అతడిని వెతుక్కుంటూ ఓ రౌడీ వస్తాడు. అతనెవరో అర్జున్, కరణ్ లని ఎందుకు చంపాలనుకున్నాడని మిగతా ఎపిసోడ్‌లలో తెలియాల్సి ఉంది. ఈ సిరీస్ లోని రెండు ఎపిసోడ్స్ లో ఎక్కడా కూడా అనవసరమైన సీన్స్ కనిపించవు. దర్శకుడు చెప్పాలనుకున్నది చెప్పేశాడు. మిగతా ఎపిసోడ్స్ పై ఇంట్రస్ట్ కలిగేలా ఈ రెండు ఎపిసోడ్ లలోనే ప్రతీ పాత్రని పరిచయం చేశారు మేకర్స్. ఇంతవరకు ఎంట్రీ ఇచ్చిన పాత్రలు, వాటిని డిజైన్ చేసిన తీరు పర్ ఫెక్ట్ గా అనిపిస్తుంది. అయితే ఇంకా కొన్ని పాత్రలు రావాల్సి ఉంది. అవి మిగతా ఎపిసోడ్ లలో తీసుకొస్తారేమో చూడాలి. అనిక్ రామ్ వర్మ ఫొటోగ్రఫీ బాగుంది. జితేంద్ర ఎడిటింగ్ నీట్ గా ఉంది. నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి అదనపు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
కరణ్, అర్జున్ పాత్రలలో గుల్షన్ దేవయ్య నటన సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచింది. అనురాగ్ కశ్యప్, సౌరభ్ సచ్ దేవ్, హార్లీన్ సేథీ తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగతా వారు వారి పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా : భిన్నమైక కథలని ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చేస్తుంది.
రేటింగ్ : 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |