![]() |
![]() |

హా హా హాసిని అంటూ బొమ్మరిల్లు తో తెలుగు ప్రేక్షకుల మనస్సులో శాశ్వత స్థానాన్ని సంపాదించిన హీరోయిన్ జెనీలియా( genelia)దాదాపు తెలుగు నాట ఉన్న అందరి అగ్ర హీరోలతో జోడి కట్టింది. బాలీవుడ్ లోను కొన్ని చిత్రాల్లో నటించింది. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే హీరో రితీష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రితీష్ కి సంబంధించిన ఒక సినిమా భారతీయ సినీ ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షిస్తుంది.
కాకుడా.. రితీష్ దేశముఖ్(riteish deshmukh) సోనాక్షి సిన్హా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న హర్రర్ అండ్ కామెడీ మూవీ. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ పోస్టర్ సినీ ప్రేమికులని విశేషంగా ఆకర్షిస్తుంది. పైగా చిత్ర నిర్మాణ బృందం కొన్ని వ్యాక్యలని కూడా జోడించింది. పురుషులకి హెచ్చరిక, జులై 12 న కాకుడా వస్తుంది. అందరు ఇంట్లోనే ఉండి తలుపులు తెరవండి అని చెప్పింది.దీంతో మూవీ మీద అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. మరో అగ్ర నటుడు సకిబ్ సలీం ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఒక గ్రామానికి కొన్నేళ్లుగా ఒక శాపం ఉంటుంది. దాని వల్ల ప్రతి మంగళవారం రాత్రి ఏడుగంటల పదిహేను నిమిషాలకి ప్రతి ఇంటికి ఒకేలా ఉన్న చిన్న తలుపు తెరవాలి.అలా తెరిచి ఉంచకపోతే ఆ ఇంట్లోని మగవాళ్ళని కాకుడా శిక్షిస్తుంది. అలా ఎందుకు, అసలు ఏమైంది అనే దానికి సమాధానం జులై 12 న థియేటర్స్ లో దొరుకుతుంది.ఈ భారీ చిత్రాన్ని రోని స్కృవాలా నిర్మిస్తుండగా ఆదిత్య సర్పోదర్ దర్శకత్వ బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.ప్రేక్షకులు భయపడుతూనే వినోదాన్ని కాకుడా ద్వారా పొందనున్నారు.
![]() |
![]() |