![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్(Jr NTR).. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర'(Devara) సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిసున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఓ వైపు 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, మరోవైపు 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కళ్ళు చెదిరేలా జరుగుతోంది.
థియేటర్లలో పెద్ద సినిమా విడుదలై చాలా రోజులైంది. ప్రేక్షకులు భారీ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 27న 'కల్కి 2898 AD' విడుదలవుతుండగా.. ఆ తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా 'దేవర'నే. అందుకే 'దేవర' బిజినెస్ (Devara Business) ఓ రేంజ్ లో జరుగుతోందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం రూ.125 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.55 కోట్లు, సీడెడ్ లో రూ.25 కోట్ల బిజినెస్ చేసిందని వినికిడి. బిజినెస్ పరంగా సీడెడ్ లో నాన్-రాజమౌళి రికార్డు క్రియేట్ చేసిందని అంటున్నారు. మిగతా సౌత్ స్టేట్స్, నార్త్ ఇండియా, ఓవర్సీస్ లోనూ.. ఈ సినిమాకి అదిరిపోయే బిజినెస్ జరిగిందట. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.200 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ చేసిందని చెబుతున్నారు. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.200 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంటుంది. పాజిటివ్ టాక్ వస్తే.. ఈ టార్గెట్ పెద్ద మేటర్ కాకపోవచ్చు.
'దేవర' నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగిందట. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.155 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ రూ.75 కోట్లకు, ఆడియో రైట్స్ రూ.33 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అంటే నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే రూ.263 కోట్లు వచ్చాయన్నమాట. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ కలిపి ఓవరాల్ గా ఈ సినిమా రూ.450-500 కోట్ల బిజినెస్ చేసిందని అంటున్నారు.
![]() |
![]() |