![]() |
![]() |

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన భార్య, కుమారుడితోపాటు కాలినడకన స్వామి సన్నిధికి చేరుకున్నారు. మెట్ల మార్గంలో త్రివిక్రమ్ కుటుంబ సభ్యులు వెలుతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంగళవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ సతీమణి సౌజన్య అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తుంటారు. కానీ, పిల్లలు మాత్రం కనిపించరు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ కుమారుడు కూడా ఈ వీడియోలో కనిపించాడు. త్రివిక్రమ్ కుమారుడు రిషి మంచి హైట్‌తో తండ్రిలాగే ఉన్నాడు. కళ్ళజోడు పెట్టుకొని కనిపించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ కుమారుడు హీరోలా ఉన్నాడంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. అసలు త్రివిక్రమ్ సడన్‌గా తిరుమల ప్రయాణమవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తనకు ఎంతో సన్నిహితుడైన పవన్‌కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే కాకుండా డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగానే ఈ దర్శనం చేసుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ దైవ దర్శనం చేసుకోవడం వెనుక ఎలాంటి ప్రత్యేకమైన కారణం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక త్రివిక్రమ్ చేయబోయే సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![]() |
![]() |