![]() |
![]() |

అవికా గోర్ (avika gor)చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో అశేష ప్రేక్షకాభిమానులని పొందింది. ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ తొలుత హిందీ మూవీల్లో మెరిసినా కూడా 2013 లో వచ్చిన ఉయ్యాలా జంపాలా తో తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయ్యింది. లక్షిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, రాజుగారి గది 3 ఇలా సుమారు ఎనిమిది సినిమాల దాకా చేసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అవికా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
1920 హర్రర్ ఆఫ్ ది ఆర్ట్స్.. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ మూవీ గత సంవత్సరం జూన్ 23 న రిలీజ్ అయ్యింది. అవికా దే మెయిన్ క్యారక్టర్. ఆమె నటనకి మంచి పేరు రావడంతో పాటు కలెక్షన్ల పరంగా కూడా బాగానే వసూలు చేసింది. ఇందులో లో చాలా వరకు రొమాన్స్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. శృంగార సన్నివేశాలు సరదాగా ఉంటాయని భావిస్తారు. కానీ వాస్తవానికి శృంగార సన్నివేశాలు చాలా బోరింగ్ గా ఉంటాయి. నాకైతే అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఏది అవసరమో అది చేస్తున్నామనే ఫీలింగ్ తప్ప మరొకటి ఉండదని చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో అవికాకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పిక్స్ కి మెంబర్ ఆఫ్ లైక్స్ వస్తాయి.పైగా గ్లామర్ గేట్లు ఎత్తేసి తన అందంతో కుర్రకారు మతులని పోగొడుతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఉమాపతి ని అంటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం హిందీ లో బ్లడీ ఇష్క్ అనే మూవీ చేస్తుంది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ప్రస్థుతానికి బిజీ గానే ఉంది.
![]() |
![]() |