![]() |
![]() |
రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా టీజర్‌లో ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్’ అంటూ రామ్ చెప్పిన పక్కా మాస్ డైలాగ్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని మరింత పెంచింది. ఈమధ్యకాలంలో రామ్ కెరీర్ నత్త నడకగా సాగుతున్న నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్’పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడని అర్థమవుతోంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో రామ్‌ను పక్కా మాస్ హీరోగా మార్చిన పూరి జగన్నాథ్.. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’తో ఓ రేంజ్ హిట్ కొట్టబోతున్నారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా రామ్ కెరీర్‌ని టర్న్ చేస్తుందనే విషయంలో సందేహం లేదు.
![]() |
![]() |