![]() |
![]() |
హీరో ఉపేంద్ర.. ఒక విలక్షణమైన నటుడు. తన కెరీర్ ప్రారంభంలో విచిత్రమైన క్యారెక్టరైజేషన్‌తో అతను చేసిన సినిమాలు అప్పట్లో ఆడియన్స్ మతి పోగొట్టాయి. హీరోలు ఇలాంటి సినిమాలు కూడా చేస్తారా అనే రేంజ్‌లో ఆయా క్యారెక్టర్లను క్రియేట్ చేశాడు ఉపేంద్ర. అలాంటి సినిమాల్లో ‘ఎ’ ఒకటి. 1998లో కోటి రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.20 కోట్లు కలెక్ట్ అప్పట్లో గొప్పరికార్డును సాధించింది. తెలుగులో డబ్ అయి ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత ‘ఎ’ చిత్రాన్ని 4కె ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేసి తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు ఉప్పి క్రియేషన్స్, చందు ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు. జూన్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ‘ఎ’ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ఉపేంద్ర హాజరు కావడం విశేషం.
చందు ఎంటర్‌టైన్‌మెంట్ లింగం యాదవ్ మాట్లాడుతూ ‘ఛత్రపతి, యోగి లాంటి బ్లాక్ బస్టర్ మూవీలను రీరిలీజ్ చేశాం. ఉపేంద్ర నటించిన ‘ఎ’ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. ఈ సినిమా కోసం బెంగళూరు వెళ్లి హీరో ఉపేంద్రను కలిసి అడిగిన వెంటనే దేవుడిలా వరం ఇచ్చారు’ అన్నారు.
నిర్మాత సైదులు మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం ఒక బైట్ ఇవ్వండి సర్ అంటే ఏకంగా హైదరాబాద్‌కే వచ్చి స్వయంగా మాట్లాడుతా అని చెప్పడం ఆశ్యర్యం వేసింది. జూన్ 21 విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు.
హీరో ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఎ’ సినిమా నా జీవితంలో మరిపోలేనిది. 26 సంవత్సరాల క్రితం ఈ చిత్రం విడుదల అవుతున్న సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నాను. ఈ సినిమాని థియేటర్లో చూసి ఇప్పటి ప్రేక్షకులు షాక్ అవుతారు’ అన్నారు.
![]() |
![]() |