![]() |
![]() |

ప్రముఖ హీరోయిన్ రవీనాటాండన్(Raveena Tandon)కి సంబంధించిన పర్సనల్ వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచిన విషయం అందరకి తెలిసిందే. ముంబై లోని అత్యంత ఖరీదు ప్రాంతం బాంద్రా లో ఆల్కహాల్ సేవించి ఉన్న రవీనా రాష్ డ్రైవింగ్ చేసి కొంత మందిని గాయపరిచిందనే వార్తలువచ్చాయి. ఇప్పుడు ఈ విషయంపైనే రవీనా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.
రవీనా ఆల్కహాల్ సేవించి ఉందని అందరి కంటే ముందుగా ఒక వ్యక్తి పోస్ట్ చేసాడు. పైగా గొడవ తాలూకు వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేసాడు. దీంతో చాలా మంది అది నిజమని అనుకున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే రవీనా సదరు వ్యక్తి మీద 100 కోట్ల రూపాయిల పరువు నష్ట దావా వేసింది. తన లాయర్ ద్వారా ఆ వ్యక్తికి నోటిసులు కూడా పంపించింది. ఉద్దేశ్య పూర్వకంగానే రవీనా ప్రతిష్టకు భంగం కలుగ చెయ్యడానికే ఆల్కహాల్ సేవించినట్టు తప్పుడు వార్తలని రాసారని రవీనా తరుపు లాయర్ సనా ఖాన్ పేర్కొంది.
.webp)
ఇక రవీనా కేసులో దర్యాప్తు చేసిన పోలీసులు వివరణ కూడా ఇవ్వటం జరిగింది. రవీనా కారు డ్రైవర్ కారు ని పార్కింగ్ చెయ్యడానికి వెనక్కి తెస్తున్నాడు.అదే టైం లో ఒక ఫ్యామిలీ కారు వెనుక బాగానే నడుచుకుంటూ వెళ్తుంది. రివర్స్ చేసేటప్పుడు వెనుక ఎవరైనా ఉన్నారా లేదా అనేది చూసుకోవాలంటు డ్రైవర్ తో గొడవకి దిగారు. ఆ గొడవ కాస్తా పెరగడంతో రవీనా అక్కడికి వచ్చి వారి నుంచి డ్రైవర్ ని రక్షించే పని చేసింది.ఇదే అక్కడ జరిగింది. అంతే కానీ రవీనా మద్యం తాగడం కానీ వాళ్ళని బతిమాలాడటం గాని జరగలేదని పోలీసులు తేల్చి చెప్పారు. సిసి టివి ఫుటేజ్ లో అదంతా క్లియర్ గా ఉంది.
![]() |
![]() |