![]() |
![]() |

తెలుగు సినిమా ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు సాయి ధరమ్ తేజ్ (sai dharam tej) మెగా మేనల్లుడు గా ఎంట్రీ ఇచ్చి సుప్రీం హీరో స్థాయికి ఎదిగాడు. 2014 లో వచ్చిన పిల్ల నువ్వులేని జీవితం నుంచి మొన్నటి బ్రో వరకు పదహారు సినిమాలకి పైగానే చేసాడు.వాటిల్లో ఎక్కువ భాగం విజయం సాధించినవే. లేటెస్ట్ గా ఆయన పవన్ కళ్యాణ్ అభిమానుల మనసుదోచుకున్నాడు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఘన విజయం సాధించాడు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈ సారి పవన్ గెలవాలని తమ తమ ఇష్ట దైవాలని మొక్కుకొని అభిమాని లేడు. అలాంటి వాళ్ళల్లో ఒక అభిమాని సాయి ధరమ్ తేజ్. పవన్ ని తన మావయ్య కంటే ఒక అభిమానిగానే ఉండటానికి తేజ్ ఇష్టపడతాడు. అలాగే పవన్ ని తన దైవంగా కూడా భావిస్తాడు. ఈ విషయాన్నీ చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక పవన్ గెలిచిన సందర్భంగా తేజ్ కాలినడకన తిరుమల(tirumala)కొండ ఎక్కి ఏడుకొండల వాడిని దర్శించుకున్నాడు. అలిపిరి మెట్ల దగ్గర నుంచి మొదలైన నడక లో తేజ్ ముఖంలో అణువణువున ఎంతో భక్తి భావం కనిపించింది. ఆ సందర్భంలో చాలా మంది తేజ్ తో ఫోటోలు దిగడానికి పోటీ పడ్డారు. అనంతరం స్వామి ని దర్శించుకుని పవన్ ని గెలిపించినందుకు కృతజ్ఞుడినయ్యి ఉంటానని వేడుకున్నాడు. తేజ్ నడకకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్ష మవ్వడంతో పవన్ అభిమానులు తేజ్ ని అభినందిస్తున్నారు.
.webp)
ఇక పవన్ విజయాన్ని తేజ్ విజయంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే పలు చోట్ల జనసేన(janasena)తరుపున తేజ్ ప్రచారం చేసాడు. పవన్ పోటీ చేసిన పిఠాపురం(pithapuram)లో కూడా ముమ్మరంగా ప్రచారం చేసాడు. ఆ సమయంలో కొంత మంది ఆకతాయిలు బీరు సీసాలతో దాడి చేసినా కూడా ఎలాంటి బెదురు లేకుండా ప్రచారాన్ని పూర్తి చేసాడు. ఇక సినిమాల పరంగా చూసుకుంటే రామ్ చరణ్ రచ్చ డైరెక్టర్ సంపత్ నంది తో గాంజా శంకర్ మూవీని స్టార్ట్ చేసాడు. కానీ ప్రెజంట్ ఆ మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. హనుమాన్(hanuman)ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి మాత్రం తేజ్ తో రీసెంట్ గా ఒక సినిమా అనౌన్స్ చేసాడు.
![]() |
![]() |