![]() |
![]() |
.webp)
ఓటీటీలలోకి ఏదైనా క్రైమ్ థ్రిల్లర్ గానీ సస్పెన్స్ థ్రిల్లర్ గానీ వస్తుందంటే ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలానే ఉన్నారు. అయితే వీటితో పాటు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి క్రేజ్ ఎక్కువే. వీటితో పాటు మన పూర్వీకులు పాతకాలంలో కొన్ని గుప్తునిధులని దాచారని, వాటి విలువ ఇప్పుడు చాలా ఉండొచ్చని ఇప్పటికి కొన్ని చోట్ల భూగర్భంలో ఏమైనా గుప్తనిధులున్నాయా అని వెలికితీయడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు.
భూగర్భం నుండి గుప్తనిధులని వెలికి తీయడాన్ని , మన తాతల నాటి నుండి ఎవరు తెరవకుండా కాపాడుతూ వస్తున్న కొన్ని గదులలో ఉన్న నిధి నిక్షేపాలు కనుగొనడాన్ని ట్రెజర్ హంట్ అంటారు. అలాంటిదే ఓ సినిమాగా మలయళ మెగా స్టార్ మోహన్ లాల్ తీసారు. అదే గన్ షాట్ మూవీ. మలయాళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఈ మూవీ కథేంటో ఓ సారి చూసేద్దాం. ఈ మూవీకి బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్, మియా, దేవ్ గిల్, విజయ్ బాబు, సిద్దిక్, విజయ కుమార్, మంజరి ఫడ్నీస్ తదితరులు నటించారు.
మిస్టర్ ఫ్రాడ్ పేరుతో మలయాళంలో రిలీజైన ఈ సినిమాని తెలుగులో గన్ షాట్ పేరుతో రిలీజ్ చేశారు. మోహన్ లాల్ దొంగగా ఈ మూవీ లో కనిపిస్తాడు. రాజకుటుంబానికి చెందినవారు నలుగురు శేఖర వర్మ, రాజశేఖర వర్మ, సుధాకర వర్మ, వాసుదేవ వర్మ. వారి తాతల కాలం నుండి వస్తున్న అమ్మవారిని ఓ గదిలో నలభై సంవత్సరాల నుండి ఉంచుతారు. అయితే ఆ అమ్మవారి చుట్టూ వజ్రాలు ఉండడంతో పాటు బంగారంతో పూర్తిగా అమ్మవారి విగ్రహం ఉంటుంది. అదే కాకుండా ఆ గదిలో వజ్రవైడూర్యాలతో కూడిన బాక్స్ లు చాలానే ఉంటాయి. దాంతో భాయ్ జీ ( మోహన్ లాల్) ఆ ట్రెజర్ ని కొట్టేయాలని ఓ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అతనికి ప్రతీ రాబరీలో సహాయం చేసే నిక్కీ, అబ్బాస్ లకి ఈ విషయం చెప్తాడు. ఇక వారి ప్లాన్ ప్రకారమే అక్కడికి వస్తారు. అయితే అదే సమయంలో వారిపై రాజ కుటుంబంలోని కొందరికి అనుమానం కలుగుతుంది. శివ రామ్ పాత్రలో భాయ్ జీ అక్కడికి వస్తాడు. శివరామ్ ప్రభుత్వం పంపిన అధికారి. కానీ దారిలో అతడిని కిడ్నాప్ చేసి ఆ స్థానంలో భాయ్ జీ వచ్చిమ. ట్రెజర్ ఓపెన్ చేస్తాడు. అయితే ఆ ట్రెజర్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి శివరామ్ అలియాస్ భాయ్ జీ ట్రెజర్ ని కొట్టేశాడా? అతనికి ఎదురైన సవాళ్ళేంటని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
![]() |
![]() |