![]() |
![]() |

వెబ్ సిరీస్ : యక్షిణి
నటీనటులు: వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ తదితరులు
రచన : వంశీ కృష్ణ
ఎడిటింగ్: కార్తికేయన్ రోహిణి
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
మ్యూజిక్: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణియన్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: తేజ మార్ని
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
కథ:
మాయ(వేదిక) అలకాపురికి చెందిన ఓ యక్షిణి. అలకాపురికి రాజు అయినటువంటి కుబేరుడి శాపం మూలాన మాయ భూమి మీదకి వస్తుంది. అదే సమయంలో ముప్పై సంవత్సరాలు అయిన పెళ్ళి కాకుండా ప్రేమించి పెళ్ళి చేసుకుందామనుకుంటున్న కృష్ణ(రాహుల్ విజయ్) వర్జిన్ గా ఉంటాడు. ఇక నాగులకి రాజు అయినటువంటి మహాకాళి(అజయ్) అడవులలో మాయని పట్టుకోవడానికి పూజలు చేస్తుంటాడు. మాయ ఇప్పటికే తొంభై తొమ్నిది మందిని చంపి తను చంపాలనుకున్న నూరవ మగాడి కోసం ఎదురుచూస్తుంటుంది. అయితే ఆ నూరవ మగాడు కృష్ణ.. అప్పటికే తనకి పెళ్లి సంబంధం కుదురుతుంది. మరోవైపు తరతరాలుగా నాగులకి, యక్షిణులకి మధ్య వైరం ఉంటుంది. అదే సమయంలో మాయకి సహాయంగా జ్వాలాముఖి (మంచు లక్ష్మి) వస్తుంది. వంద మందిని చంపితేగానీ మాయకి శాప విముక్తి కాదు. ఆ వంద మందిని ఎలా చంపింది? వందో వ్యక్తి ఎవరు? మాహని మహాకాళి పట్టుకున్నాడా లేదా అనే మిగతా కథ.
విశ్లేషణ:
ఉద్దరామతంత్రం అనే గ్రంథంలో అసలేం ఉందంటే.. అంటూ యక్షిణులకి, నాగులకి మధ్య జరిగే ఆధిపత్య పోరుని హారర్ జోడించి తేజ యార్ని వివరించిన కథ సక్సెస్ అయిందనే చెప్పాలి. ప్రతీ ఎపిసోడ్ ని చాలా జాగ్రత్తగా ఏదీ అతిగా లేకుండా.. ఎక్కడ బోర్ కొట్టకుండా.. అలా తీసుకెళ్ళాడు.
మాయ తన శాపానికి విముక్తి పొందగలదా లేదా అనే క్యూరియాసిటితో పాటు నాగుల రాజు అయినటువంటి మహాకాళి తనని పట్టుకుంటాడా లేదా అనే ఇంటెన్స్ తో తీసుకెళ్ళగలిగారు మేకర్స్. ఈ సిరీస్ లో మొత్తం అయిదు ఎపిసోడ్ లు ఉన్నాయి. మొదటిది ది హోప్.. ఇందులో యక్షిణి ఎవరు.. తన చంపాలనుకున్న వందో మగాడిని కనిపెట్టిందా లేదా అనేది చూపించారు. రెండవ ఎపిసోడ్.. ది హంట్.. నాగుల రాజు మహాకాళి చేసిన తపస్సుకి నాగదేవత సౌగంధిక అనే పవర్స్ ఉన్న పుష్పాలని ఇస్తుంది. వాటి మూలంగా మహాకాళి తన శత్రువు అయినటువంటి మాయ జాడ వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అతనికి జ్వాలాముఖి కనిపిస్తుంది.
మూడవ ఎపిసోడ్ ది ట్రాప్.. మహాకాళి తన గురువికిచ్చిన మాట ని తను పొందడానికి సరైన అవకాశం లభిస్తుంది. ఇక మాయ జాడ కోసం మహాకాళి వెళ్తాడు. నాల్గవ ఎపిసోడ్: ది రివిలేషన్.. మాయ తన ప్లాన్ ప్రకారం కృష్ణని పెళ్ళి చేసుకుంటుంది. అయితే అంతలోనే కృష్ణ వాళ్ళ కుటుంబంలో ప్రమాదం సంభవిస్తుంది. దాంతో కృష్ణ, మాయల శోభనం ఆగిపోతుంది. మరోవైపు మాయకి సమయం తక్కువగా ఉంటుంది. అయిదవ ఎపిసోడ్: ది వెంగెన్స్ .. ఇందులో మాయని వెతుక్కుంటు వచ్చిన మహాకాళికి జ్వాలాముఖి దొరుకుతుంది. అదే సమయంలో మాయ అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఆరవ ఎపిసోడ్: ది బిగినింగ్ .. కుబేరుడి దగ్గర మాయ తన శాపం గురించి పూర్తిగా తెలుసుకుంటుంది. అదే సమయంలో మహాకాళి వచ్చి మాయని గుప్తమందిరంలో బంధిస్తాడు. ఇక మాయని ప్రేమించిన కృష్ణ.. తనకి సాయం చేశాడా లేదా అనేది మిగతా కథ.
సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ సిరీస్ నిడివి కూడా తక్కువే. ఒక్కో ఎపిసోడ్ కి అంచనాలు మారిపోతుంటాయి. ట్విస్ట్ లతో పాటు ఎంగేజింగ్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతీ ఒక్కరు మాయ, మహాకాళి పాత్రలకి కనెక్ట్ అవుతారు. చివరి వరకు సాగే ఈ ఆధిత్యపోరు ఉత్కంఠభరితంగా సాగుతుంది. అడల్ట్ సీన్స్ లేవు. రెండు మూడు చోట్ల లిప్ లాక్ లు తప్ప పెద్దగా అడల్ట్ సీన్స్ లేవు. వాటిని స్కిప్ చేస్తే బెటర్. అసభ్య పదజాలం వాడలేదు. వంశీకృష్ణ రచన బాగుంది. స్క్రీన్ ప్లే అలా చివరి వరకు చూసేలా ఉంది. కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్ నీట్ గా ఉంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. కొన్ని చోట్ల బిజిఎమ్ అదనపు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ ఆకట్టుకుంది.
నటీనటుల పనితీరు:
మాయ పాత్రలో వేదిక, కృష్ణ పాత్రలో రాహుల్ విజయ్, మహాకాళి పాత్రలో అజయ్, జ్వాలాముఖి పాత్రలో మంచు లక్ష్మీ ఆకట్టుకున్నారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఫాంటసీ, హారర్ జోనర్స్ ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తుంది.
రేటింగ్: 3 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |