![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్(prabhas)హీరోగా వచ్చిన మూవీ బుజ్జిగాడు మేడిన్ చెన్నై. అందులో త్రిష చెల్లెలుగా చేసిన భామ సంజన గల్రాని(sanjana galrani)సెకండ్ హీరోయిన్ అని కూడా భావించవచ్చు. పవన్ కళ్యాణ్ (pawan kalyan)సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. అవే కాకుండా మెయిన్ హీరోయిన్ గా తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసింది. తాజాగా ఆమె కన్నడ హీరో దర్శన్ (darshan)గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
రేణుక స్వామి హత్య కేసులో ఇటీవల దర్శన్ అరెస్ట్ అయిన విషయం అందరకి తెలిసిందే. దీంతో కర్ణాటక వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా దర్శన్ మీద నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. దర్శన్ ని సినిమాల నుంచి బహిష్కరించాలని డిమాండ్ రోజు రోజుకి పెరుగుతుంది. రేణుక స్వామి తల్లి అయితే తన బిడ్డని చంపిన హంతకులని ఉరి తియ్యాలని కూడా అంటుంది.ఇక ఇప్పుడు ఈ విషయంపై సంజన మాట్లాడుతు దర్శన్ వ్యవహారం కన్నడ సినీ పరిశ్రమకి బ్లాక్ డే లాంటిది. కన్నడ ప్రజలు దర్శన్ సినిమాలని చాలా ఇష్టపడతారు.ఆరాధన భావంతో పూజిస్తారు కూడా. నాకు తెలిసిన దర్శన్ చాలా సున్నితమైన స్వభావి. గౌరవ ప్రదమైన వ్యక్తి . షూటింగ్ సమయంలో నన్ను చాలా ఆప్యాయంగా చూసుకునే వాడు కనీసం నన్ను పేరు పెట్టి కూడా పిలవడు. జీ సునీయే, అమ్మ అని పిలుస్తాడు. స్త్రీలని గౌరవంచడంలో ఎప్పుడు ముందు ఉంటాడు.
కానీ దర్శన్ ప్రస్తుత పరిస్థితి చూసి షాక్ అయ్యాను. నేనే కాదు బహుశా కర్ణాటకలోని ప్రతి వ్యక్తి షాక్ కి గురయ్యి ఉంటాడు.
అలాగే ఈ సంఘటనతో నాకో విషయం తెలిసొచ్చింది. మనకి తెలిసిన వ్యక్తి,లో రెండు విభిన్న పార్శ్యాలు ఉంటాయని అర్ధమయ్యింది. ఏది ఏమైనా ఒక సెలబ్రిటీ విషయంలో నిర్ణయం తీసుకునే ముందు న్యాయపరంగా ఆలోచించాలి .ఒక వేళ వెంటనే నిర్ణయం తీసుకునే తొందర పాటు అవుతుంది. సెలబ్రిటీ విషయంలో ఐదు శాతం ఆరోపణ ఉంటే అది 500 శాతంగా మారుతుంది. ఇప్పుడు సంజన చెప్పిన ఈ మాటలని బట్టి దర్శన్ కి అండగా నిలిచిందని భావించవచ్చు. వారిద్దరు కలిసి అగ్రజ ,అర్జున్ వంటి సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేసారు. సోషల్ మీడియా లో కొంత మంది చనిపోయిన వ్యక్తి గురించి ఆలోచించవా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
![]() |
![]() |