![]() |
![]() |
.webp)
మూవీ : రష్
నటీనటులు: డైసీ, రవిబాబు, కార్తిక్ ఆహుతి, యాదగిరి
ఎడిటింగ్: సత్యనారాయణ బల్లా
మ్యూజిక్: ఎస్. ఎస్ రాజేష్
సినిమాటోగ్రఫీ: ఎమ్. సుధాకర్ రెడ్డి
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత : రవిబాబు
దర్శకత్వం: సతీష్ పోలోజు
ఓటీటీ: ఈటీవి విన్
కథ:
కార్తీక, ఆదిత్య ఇద్దరు భార్యాభర్తలు. సిటీలో లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తూ ఉంటారు. వారికి రిషి , రియా అనే ఇద్దరు పిల్లలు. ప్రతీరోజు కార్తీక భర్త ఆదిత్య ఆఫీసుకి వెళ్లిపోతుంటాడు. ఇక పిల్లలను స్కూల్ కి డ్రాప్ చేయడం .. తీసుకురావడం అంతా కార్తీక చూసుకుంటుంది. ఒక రోజున ఆఫీసుకి వెళ్లిన ఆదిత్యకి.. వాళ్ళ స్థలాన్ని ఎవరో కబ్జా చేస్తున్నారని ఒక కాల్ వస్తుంది. దాంతో ఆదిత్య హడావిడిగా కార్లో వెళుతూ ప్రమాదానికి గురవుతాడు. ఆదిత్యను హాస్పిటల్లో చేర్చినట్టుగా వీరయ్య అనే ఒక వ్యక్తి కార్తీకకి కాల్ చేసి చెప్తాడు. అప్పటి నుంచి హాస్పిటల్ వారు అడుగుతున్న ఎమౌంట్ ను ట్రాన్స్ ఫర్ చేస్తూ, పిల్లలిద్దరిని తీసుకుని ఆమె అక్కడికి బయల్దేరుతుంది. అయితే దారిలో ఒక నలుగురు బైకర్స్ తో ఆమెకి గొడవ అవుతుంది. దాంతో వాళ్లు ఆమెను బెదిరిస్తూ వెంటపడుతుంటారు. అతికష్టం మీద వాళ్ల బారి నుంచి ఆమె బయటపడుతుంది. అదే సమయంలో బైకర్స్ గాయపడిన ప్రదేశానికి పోలీస్ ఆఫీసర్ శివ ( రవిబాబు) చేరుకుంటాడు. ఒక లేడీ తమను కారుతో డ్యాష్ ఇచ్చేసి పోయిందని ఆ బైకర్స్ చెబుతారు. మరోవైపు నర్సింగ్ అనే రౌడీ కార్తీక కూతురు రియాను కిడ్నాప్ చేస్తాడు. సీసీటీవీ పుటేజ్ లో కార్తీకని చూసిన శివ షాక్ అవుతాడు. కార్తీక ఎవరు? ఆమెను చూసి పోలీస్ ఆఫీసర్ శివ ఎందుకు షాక్ అవుతాడు? ఆదిత్య కోసం హాస్పిటల్ కి వెళ్లాలనుకున్న కార్తీకకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? హార్డ్ డిస్క్ కోసం అన్వేషిస్తున్నది ఎవరనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
భర్తకి యాక్సిడెంట్ కావడంతో హాస్పిటల్ కి బయల్దేరిన భార్యకి తెగింపుతో పాటు ధైర్యం కూడా ఉండాలంటూ దర్శకుడు సతీష్ పోలోజు కథని ఎత్తుకున్న తీరు బాగుంది. అయితే ఆ తర్వాత సీన్లు వెళుతూ ఉంటే ఎక్కడా కూడా సినిమా ఫీల్ రాదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ మాదిరి అనిపిస్తుంది.
బహుశా ఇది 'లో ప్రొడక్షన్ వాల్యూస్' వల్లేమో కానీ సీన్లు వస్తున్నకొద్దీ ఓపిక తగ్గిపోతుంది. ఫస్టాఫ్ నుండి కథలో ఏదైన మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సెకెంఢాఫ్ లో రవిబాబు ఎంట్రీతో కథ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అయితే సినిమాలో ట్విస్ట్ లు లేకపోవడం.. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ముందుగానే మనం గెస్ చేశేలా స్క్రీన్ ప్లే సాగుతుంది. సరైన బిజిఎమ్, సరైన ఇంటెన్స్ లేకపోవడంతో ఆడియన్స్ కి నీరసం కలుగుతుంది.
కామెడీ, ఎంటర్‌టైన్మెంట్, సాంగ్స్ ఏమీ లేకపోగా.. సస్పెన్స్ తో పాటు సరైన ట్విస్ట్ లు కూడా లేకపోవడం.. కథనం ఇంటెన్స్ గా వెళ్ళకపోవడం మైనస్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నిడివి తక్కువే కాబట్టి స్టోరీ ఏంటా అని ఒకసారి చూడొచ్చు. సత్యనారాయణ ఎడిటింగ్ బాగుంది. సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సతీష్ బిజిఎమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. లో ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి మైనస్.
నటీనటుల పనితీరు:
కార్తీక పాత్రలో డైసీ ఆకట్టుకుంది. పోలీస్ ఆఫీసర్ శివగా రవిబాబు ఒదిగిపోయాడు. కార్తీక భర్త ఆదిత్యగా కార్తిక్ ఆకృహి ఒదిగిపోయాడు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా: నిడివి తక్కువే కాబట్టి ఓసారి చూసేయొచ్చు.
రేటింగ్: 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |