![]() |
![]() |

ఖడ్గం సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని పృథ్వీ (prudhvi raj) చెప్పిన డైలాగ్ విని చాలా మంది కామెడీగా చెప్తున్నాడని అనుకున్నారు. కాకపోతే ఆ సన్నివేశం యొక్క ఉద్దేశ్యం కామెడీ నే అనుకోండి. కానీ నిజంగానే పృథ్వీ తెలుగు సినిమా పరిశ్రమతో ఉన్న అనుబంధం ముప్పయ్యేళ్ల పై మాటే. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త వస్తుంది. ఇప్పుడు ఆ విషయంపై స్పందించాడు.
కొన్ని సంవత్సరాల క్రితం పృథ్వీ తన మొదట భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.దాంతో ప్రతి నెల ఆమెకి భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ప్రతి నెల చెల్లిస్తున్నాడు. కానీ కొన్ని యు ట్యూబ్ చానెల్స్ లో పృథ్వీ తన భార్యకి భరణం చెల్లించనందుకు అరెస్ట్ అయ్యాడనే వార్తలని ప్రచురించాయి.ఈ క్రమంలో పృథ్వీ ఒక వీడియోని రిలీజ్ చేసాడు. తనని ఎవరు అరెస్ట్ చెయ్యలేదు. కోర్టు ఆదేశానుసారం ప్రతి నెల భరణం చెల్లిస్తున్నానని చెప్పాడు. అదే విధంగా తనపై తప్పుడు వార్తలు రాసిన వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని కూడా తెలిపాడు.
![]() |
![]() |