![]() |
![]() |

షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని, సినిమా అవకాశాలు పొందిన చాందిని చౌదరి (Chandini Chowdary).. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా 'కలర్ ఫోటో' చిత్రం ఆమెకి ఎంతో పేరు తీసుకొచ్చింది. కొంతకాలంగా వరుస సినిమాలతో అలరిస్తున్న చాందిని.. ఈ ఏడాది ఇప్పటికే 'గామి'తో ఆకట్టుకుంది. ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలతో అలరించడానికి సిద్ధమైంది.
చాందిని చౌదరి నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. జూన్ 14న 'యేవమ్' (Yevam), 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy) సినిమాలు రిలీజ్ కానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'యేవమ్'లో సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్య పాత్రలో చాందిని నటించింది. ఇక కామెడీ డ్రామాగా రూపొందిన 'మ్యూజిక్ షాప్ మూర్తి'లో అజయ్ ఘోష్ టైటిల్ రోల్ పోషించగా, కథకి ఎంతో కీలకమైన అంజన పాత్రలో చాందిని యాక్ట్ చేసింది.

ఇలా చాందిని నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల జానర్లు వేరు. మరి ఈ చిత్రాలతో చాందిని ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |