![]() |
![]() |
‘ఏమాయ చేసావె’.. ఈ సినిమా ఆ ముగ్గురికీ ప్రత్యేకం. ఒకరు సమంత. హీరోయిన్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసిన తొలి సినిమా అదే. రెండో వారు నాగచైతన్య.. వీరిద్దరినీ ప్రేమలో పడేసి పెళ్ళి వరకు తీసుకెళ్ళిన సినిమా ఇదే. ఇక మూడో వ్యక్తి గౌతమ్ వాసుదేవ్ మీనన్. అతని కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌లాంటి మూవీగా ‘ఏమాయ చేసావె’ నిలిచిపోతుంది. తనను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేసిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలోనే మరో సినిమా చేసేందుకు సమంత సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఇదే జరిగితే సమంతకు ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. గతంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చిత్రంలో కూడా సమంత హీరోయిన్‌గా నటించింది.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి, గౌతమ్ మీనన్‌లో ఓ సినిమా ప్రారంభం కానుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ జూన్ 15న చెన్నయ్‌లో ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి మమ్ముట్టి షూటింగ్‌లో పాల్గొంటారు. మమ్ముట్టి సొంతంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఇటీవలి కాలంలో మమ్ముట్టి టర్బో, భ్రమయుగం వంటి మంచి విజయాలను అందుకున్నారు. ‘కడుగన్నావా ఒరు యాత్ర’, ‘బజూకా’ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు మమ్ముట్టి.
![]() |
![]() |