![]() |
![]() |
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్‌కే కాదు, బాలీవుడ్‌కి కూడా డార్లింగ్ అయిపోయారు. అతనితో సినిమాలు నిర్మించేందుకు బాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌసెస్ ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే ప్రముఖ నిర్మాణ సంస్థ టిసిరీస్ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని నిర్మించింది. టాక్ పరంగా, కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి. అయితే బిజినెస్ పరంగా ‘ఆదిపురుష్’కి మంచి లాభాలే వచ్చాయి. అందుకే ప్రభాస్‌తో మరో సినిమా చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ప్రభాస్‌కి అడ్వాన్స్ రూపంలో భారీ మొత్తాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కొంతమంది దర్శకులతో కథలు సిద్ధమ చేయించే పనిలో ఉంది టి సిరీస్. వారిలో ‘వార్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ పేరు కూడా వినిపిస్తోంది. వార్ తర్వాత ప్రభాస్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చెయ్యాలనుకున్నారు. కానీ, సిద్ధార్థ్.. ప్రభాస్ ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ సెట్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఇంతకుముందే ప్రభాస్ కోసం సిద్ధార్థ్ కథ రెడీ చేసాడు. కాబట్టి వీలైనంత త్వరగా షూటింగ్‌కి వెళ్లిపోవచ్చు. కానీ, ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. టి సిరీస్‌తో ప్రభాస్ సినిమా చెయ్యాలంటే మరో రెండేళ్ళు ఆగాల్సిందే. మరి ఈ రెండేళ్లలో మరో డైరెక్టర్ ప్రభాస్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఓకే చేయించుకుంటే తన పరిస్థితి ఏమిటి అని సిద్ధార్థ్ అనుకుంటున్నాడు. ఏది ఏమైనా ప్రభాస్‌తో టి.సిరీస్ మరో సినిమా చేయబోతోంది. అయితే దర్శకుడు ఎవరు అనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
![]() |
![]() |