![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అని ప్రచారం జరుగుతుంది కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో చిరంజీవి (Chiranjeevi) ఒక్క ట్వీట్ తో కన్ఫర్మ్ చేసేశారు.
.webp)
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునా యుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!!" అంటూ తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం అంటూ ట్విట్టర్ లో పవన్ పేరుని ట్రెండ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. చిరంజీవి ట్వీట్ తో మరింత సంబరపడుతున్నారు.
![]() |
![]() |