![]() |
![]() |

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ కూడా రాణించగలదు అని నిరూపిస్తున్న నటి చాందిని చౌదరి(chandini chowdary)అధ్బుతమైన పెర్ఫార్మెన్స్ ఆమె సొంతం. కేవలం తన టాలెంట్ ని నమ్ముకొంటు ఒక్కో మెట్టు ఎదుగుతు ప్రేక్షకులకి వాంటెడ్ హీరోయిన్ గా మారే స్థాయికి చేరుకుంటుంది. రీసెంట్ గా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.
హీరోల సినిమాలే ఒకే రోజు రెండు విడుదల అవ్వవు. అలాంటిది చాందిని చౌదరి ఇప్పుడు రెండు సినిమాలతో వస్తుంది. జూన్ 14 న యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి విడుదల అవుతున్నాయి. వాటికి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చాందిని తన కాలేజ్ డేస్ ని గుర్తు చేసుకుంది. నేను ఇంటర్మీడియేట్ విజయవాడ చైతన్య కాలేజీ లో చదివాను. ఎడ్యుకేషన్ బాగా కొనసాగాలని హాస్టల్‌లో జాయిన్ అయ్యాను.కానీ మూడే మూడునెలల్లో అక్కడ నుంచి జంప్ అయ్యాను. అందుకు కారణం ఉంది. అందరికీ కామన్ బాత్ రూంలు ఉండేవి. బాత్ రూం దొరకాలంటే గంటన్నర పాటు లైన్‌లో ఉండాల్సిన పరిస్థితి. బకెట్లు పట్టుకుని క్యూలో అలాగే నిలబడే దాన్ని. పైగా ఉదయం ఆరు గంటలకే క్లాస్‌లు స్టార్ట్. దాంతో ఆ బాధలు పడలేక జంప్ అయ్యానని చెప్పుకొచ్చింది.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌తో మొదలైన ఆమె సినీ ప్రయాణం ఇప్పుడు మంచి జోరు మీద ఉంది.పైగా కలర్ ఫోటో, గామి లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇక యేవమ్(yevam)లో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమా మీద అందరిలో అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్ కి కూడా మంచి స్పందన వస్తుంది. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
![]() |
![]() |