![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎన్నో అపురూప సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ తన సోదరుడు చిరంజీవి (Chiranjeevi) దగ్గరకు వెళ్లిన పవన్.. ఆయన కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సమయంలో చిరంజీవి కళ్ళలో ఆనందభాష్పాలు కనిపించాయి.
.webp)
దీంతో పాటు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మరో మధుర సంఘటన చోటు చేసుకుంది. ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ (Balakrishna).. వేదిపై ఉన్న తన సోదరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దగ్గరకు వెళ్లి.. ఆత్మీయ ఆశీర్వాదం అందించారు. అలాగే నుదుటిపై ముద్దు పెట్టుకొని చెల్లెలిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.
![]() |
![]() |