![]() |
![]() |

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన హార్ట్ ఎటాక్ ద్వారా తెలుగు పేక్షకులకి పరిచయమైన భామ ఆదా శర్మ(adah sharma)మొదటి సినిమాతోనే గ్లామర్ పరంగాను యాక్టింగ్ పరంగాను మంచి పేరు సంపాదించింది. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రెజంట్ మాత్రం తన హవా నడుస్తుంది.ఇక రీసెంట్ గా ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో ఆదా శర్మ కూడా ఒకటి. ఎప్పటికప్పుడు తన సినిమాలకి సంబంధించిన విషయాలని అందరకి తెలియచేస్తుంది. అదే విధంగా రకరకాల ఫోటోలు వీడియోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలని అభిమానులతో పంచుకుంది. నేను ఎండోమెట్రియోసిస్ అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను. పీరియడ్స్ నాన్‌స్టాప్‌గా వస్తుండటం వల్ల ఆ వ్యాధి వస్తుంది. దాంతో దాదాపు 48 రోజుల పాటు బ్లీడింగ్ అవుతుందని చెప్పింది. అలా జరగడానికి కారణాన్ని కూడా తెలిపింది. కొన్ని సినిమాల కోసం డైటింగ్ ని పాటించాల్సి వచ్చింది. కేరళ స్టోరీ లో కాలేజీ అమ్మాయిలా కనిపించాలి. అందుకోసం కఠినమైన ఆహార నియమాలు పాటిస్తు బరువు తగ్గాను. ఆతర్వాత బస్తర్ మూవీ కోసం బరువు పెరిగాను.
ఇలా బరువు తగ్గడం, మళ్లీ పెరగడం వల్ల బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఫలితంగా అనారోగ్యానికి గురయ్యాను. చాలా ఇబ్బందిపడుతున్నాను అని కూడా తెలిపింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేరళ స్టోరీ నుంచి అదాశర్మ ఫ్లేట్ మారిపోయింది. హిందు యువతీ నుంచి ముస్లిం యువతిగా మారే క్యారక్టర్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు మరల్చుకుంది. రీసెంట్ గా బస్తర్ తో కూడా ఘన విజయాన్ని అందుకుంది.
![]() |
![]() |