![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నుంచి సినిమా వస్తుందంటే తెలుగునాట ఉండే సందడే వేరు. పైగా ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస విజయాల తర్వాత.. ఆయన తన తదుపరి చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ విషయంలో బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'NBK 109' నుంచి స్పెషల్ బర్త్ డే గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. "జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థం తెలియని అసురుడు" అంటూ పవన్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. అయినప్పటికీ ఆయన అభిమానులు ఓ విషయంలో డిజప్పాయింట్ అయ్యారు. అదేంటంటే ఈ సినిమాకి 'వీరమాస్' అనే టైటిల్ ఖరారైందని, దానిని బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా రివీల్ చేస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ టైటిల్ ని రివీల్ చేయకపోవడంతో.. అభిమానులు నిరాశ చెందారు. మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న బాలయ్య లాంటి మాస్ హీరోకి.. 'వీరమాస్' టైటిల్ సరిగ్గా సరిపోతుంది. అందుకే ఆ టైటిల్ వినగానే ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఇప్పుడు టైటిల్ విషయంలో సస్పెన్స్ వీడకపోవడంతో.. అసలు ఈ టైటిల్ ఫిక్స్ అయిందా లేదా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.
![]() |
![]() |