![]() |
![]() |
.webp)
తెలుగు సినిమాకి, తెలుగు పత్రికారంగానికి విశేష సేవలు అందించిన రామోజీరావు (ramoji rao) గారు ఇటీవల స్వర్గస్తులైన విషయం అందరకి తెలిసిందే. దీంతో పై రెండు రంగాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయా రంగాల్లోని ఎంతో మంది రామోజీ రావు గారితో ఉన్న తమ సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది
రామోజీరావు గారు నిర్మాతగా అన్ని భాషల్లో కలిపి 85 చిత్రాలు దాకా నిర్మించారు. వాటిల్లో ఎక్కువ భాగం విజయవంతమైనవే. పైగా సామాజికంగా ప్రజల్లో చైతన్యాన్ని కూడా నింపాయి.ఇదే క్రమంలో వంద చిత్రాలని పూర్తి చెయ్యాలనే ప్లాన్ చేసారు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని రామోజీ రావు గారే వెల్లడించారు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. అందులో భాగంగా కొంత మంది దర్శకులకి, హీరోలకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఎవరయి ఉంటారని అందరు అనుకుంటున్నారు. కోవిడ్ కంటే ముందే ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. వారసులు అయినా రామోజీ రావు గారి కోరికని నెరవేరుస్తారేమో చూడాలి.
1984 లో వచ్చిన శ్రీవారి ప్రేమలేఖ తో రామోజీ రావు గారి సినీ ప్రస్థానం ప్రారంభం అయ్యింది. మయూరి, ప్రతిఘటన,మౌన పోరాటం , అశ్వని, డాడీ డాడీ, నువ్వే కావాలి .చిత్రం, ఆనందం, నిన్ను చూడాలని, నిన్ను కలిసాక, నువ్విలా , బెట్టింగ్ బంగారాజు, విధి లాంటి మంచి చిత్రాలు ఆయన లిస్ట్ లో ఉన్నాయి. 2015 లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన దాగుడు మూతల దండాకోర్ చివరి చిత్రం.
![]() |
![]() |