![]() |
![]() |
.webp)
ప్రస్తుతం మెగా కుటుంబం, మెగా అభిమానులు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగగా.. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడి పవన్ ఇంతటి విజయం సాధించారు. ఈ విజయ గర్వంలోనూ కుటుంబంలోని పెద్దల పట్ల తన వినయాన్ని చాటుకున్నారు జనసేనాని.
ఎన్డీఏ కూటమి సమావేశం కోసం తన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసిన ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్.. గురువారం హైదరాబాద్ లోని తన అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కి మెగా స్వాగతం లభించింది. పూలు వర్షం కురిపిస్తూ మెగా కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తల్లి అంజనా దేవి, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖా వాణి పాదాలకు నమస్కరించి పవన్ ఆశీర్వాదం తీసుకోవడం.. అలాగే వారు పవన్ ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆ సమయంలో పక్కనే ఉన్న నాగబాబు కంటతడి కూడా పెట్టుకున్నారు. ఈ మెగా సంబరంలో రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంతో ఎమోషనల్ గా ఉన్న వీడియో.. మెగా అభిమానులకు జీవితంలో మర్చిపోలేని బిగ్ గిఫ్ట్ అని చెప్పవచ్చు.
![]() |
![]() |