![]() |
![]() |

శర్వానంద్ (Sharwanand), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'మనమే' (Manamey). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(జూన్ 7న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది.
'మనమే' చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లలో అడుగు పెడుతోంది. సెన్సార్ సభ్యులు, అలాగే ఈ మూవీ ప్రత్యేక షో చూసిన సినీ ప్రముఖుల నుంచి.. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా అంటున్నారు. అలాగే కథలోనే భాగమవుతూ ఉన్న కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయిందట. అలాగే శర్వా, కృతి, చిన్న బాబు మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయట. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఎమోషన్స్ తో కట్టిపడేసిందట సినిమా. ఇక హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచిందని అంటున్నారు. బిట్ సాంగ్స్ తో కలిపి మొత్తం 16 పాటలున్నాయట. అయినప్పటికీ స్టోరీ ఫ్లోని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా.. కథలో మరింత లీనం చేసేలా ఆ సాంగ్స్ ఉంటాయట. మొత్తానికి 'మనమే' సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. శర్వానంద్ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.
![]() |
![]() |