![]() |
![]() |

సింగర్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ కొంత మంది మాత్రం అడ్డంగా నిలబడిపోతారు. అలా నిలబడిపోయిన సింగర్స్ లో ఒకరు మంగ్లీ (mangli)అన్ని రకాల పాటలని పాడగలదు. ఫోక్ పాటల గురించి అయితే చెప్పక్కర్లేదు. వయసుతో తారతమ్యం లేకుండా అందరి చేత ఆమె వాయిస్ డాన్స్ లు వేయిస్తుంది. ఇక లేటెస్ట్ గా ఆమె పాడిన ఒక పాట విడుదలైన కాసేపట్లలోనే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్(hebba patel)జంటగా నటిస్తున్న మూవీ ధూం ధాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి ఒక పాటని రాసాడు. మల్లెపూల ట్యాక్సీ అనే క్యాచీ లిరిక్ తో స్టార్ట్ అయిన ఆ పాటని మంగ్లీ ఆలపించింది. రీసెంట్ గా మేకర్స్ పాట ని రిలీజ్ చేసారు. మంగ్లీ గొంతుతో పాటకి సరికొత్త ఊపు వచ్చినట్లయ్యింది. ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ పెళ్లి సందర్భంలో సదరు పాట రానున్నట్లు తెలుస్తోంది. హిట్ పాటల స్వర కర్త గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ సాంగ్ కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆఫ్ ది స్క్రీన్ పాట పాడిన మంగ్లీ తెరపై కూడా కనిపించబోతుంది.దీంతో ఆమె అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. తెరపై ఎప్పుడెప్పుడు మంగ్లీ ని చూద్దామా అని అనుకుంటున్నారు.మరి హెబ్బా కూడా చిందులేస్తుందేమో చూడాలి.. మచ్చ సాయి కిషోర్ దర్శకత్వం వహించగా ఎంఎస్.రామ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. జూలై లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
![]() |
![]() |