![]() |
![]() |

గెటప్ శ్రీను, అంకిత ఖరత్ జంటగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజు యాదవ్' (Raju Yadav). మే 24న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. అయితే దర్శకుడు ఎంచుకున్న కొత్త పాయింట్ కి, అలాగే శ్రీను నటనకి మంచి మార్కులే పడ్డాయి. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'రాజు యాదవ్' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 21న ఓటీటీలోకి అడుగు పెట్టనుందని సమాచారం. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలోకి రాబోతుందన్నమాట.
సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి నిర్మించిన 'రాజు యాదవ్' చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా సాయిరామ్ ఉదయ్, ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి వ్యవహరించారు.
![]() |
![]() |