![]() |
![]() |

తెలుగు సినిమాకి దొరికిన ఒక గొప్ప వరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)తన నటనలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. ప్రస్తుతం దేవర (devara)షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అక్టోబర్ లో దేవర ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల గురించి ట్వీట్ చేసాడు.

ప్రియమైన చంద్రబాబు నాయుడి మావయ్యకి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ (balakrishna)బాబాయికి, MPలుగా గెలిచిన భరత్ కి శుభాకాంక్షలు అని చెప్పాడు. అదే విధంగా బి జె పి తరుపున గెలిచిన పురందేశ్వరి అత్తకి అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ (pawan kalyan) గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కూడా తెలియచేసాడు. ఇక ఈ ట్వీట్ తో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.
![]() |
![]() |