![]() |
![]() |

నాచురల్ స్టార్ నాని (nani)ని ఇన్ని రోజులు మీరు చూసింది ఒక లెక్క. ఇక నుంచి చూడబోయేది ఒక లెక్క. అవును ఇది నిజం. రీసెంట్ గా మొన్న జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో క్లీన్ స్వీప్ చేసిన చంద్ర బాబు నాయుడు కి పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్పి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇప్పుడు రీల్ లో హీరో గా విలన్స్ కి చుక్కలు చూపించబోతున్నాడు.
నాని అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం(saripoda sanivaram)..తెలుగు సినిమాకి ఆస్కార్ ని కట్టబెట్టిన ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.లాస్ట్ ఇయర్ నవంబర్ లో షూటింగ్ ని ప్రారంభించుకుంది. అప్పటినుంచి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా సరికొత్త షెడ్యూల్ ని ప్రారంభించుకుంది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సిద్ధం చేస్తున్నారు. నాని కెరీర్ లోనే ఇంతవరకు అలాంటి యాక్షన్ సీన్ రాలేదనే మాటలు వినిపిస్తున్నాయి. అదే విధంగా సినిమాకి కూడా కీలకంగా మారనున్నాయని అంటున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకి అద్భుతమైన ఫైట్స్ ని కంపోజ్ చేసిన రామ్ లక్ష్మణ్ నేతృత్యంలో చిత్రీకరిస్తున్నారు. మొత్తం పది రోజుల పాటు ఆ షెడ్యూల్ జరగనుంది.

నాని సరసన ప్రియాంక మోహాన్ (priyanka mohan) హీరోయిన్ గా చేస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ఈ ఇద్దరి కాంబోలో గ్యాంగ్ లీడర్ వచ్చింది. ప్రియాంక మోహన్ ఫస్ట్ మూవీ కూడా ఇదే. ఇప్పుడు ఈ భామ పవన్ కి జతగా ఓజి లోను చేస్తుంది. ఇక వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం తెరకెక్కుతుంది. గతంలో ఆ ఇద్దరి కాంబోలో అంటే సుందరానికి వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. దీంతో సరిపోదా శనివారం మీద అందరిలోను భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఆగస్టు 29 న విడుదల కానుంది.
![]() |
![]() |