![]() |
![]() |

సినిమా రంగంలో తిరుగులేని హీరోగా చెలామణి అవుతు అభిమానుల చేత పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్న హీరో పవన్ కళ్యాణ్(pawan kalyan)ప్రజలకి సేవ చెయ్యడానికి జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. మే 13 న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి ఎంఎల్ఏ గా పోటీ చేసి గెలుపొందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందం మిన్నంటింది. ఈ క్రమంలో ఆయన తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.
పవన్ కళ్యాణ్ అమ్మ పేరు అంజనా దేవి (anjana devi)..పవన్ ఆమెకి మూడో కొడుకు. ఉదయం నుంచే పవన్ గెలుపుతో పాటు పార్టీ అభ్యర్థుల గెలుపుని కోరుతూ టీవీలో చూస్తూ ఉన్నారు. ఇక పవన్ గెలిచాడనే వార్త రావడంతో చాలా భావోద్వేగానికి లోనయ్యారు. నా కొడుకు పడ్డ కష్టానికి ఆ దేవుడు మంచి ఫలితం ఇచ్చాడని, పవన్ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక రోజు గాజు గ్లాస్ తో టీ తాగుతానని కూడా చెప్పారు. ఇప్పుడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అనే విషయం అందరకి తెలిసిందే.మేము కూడా రోజు గాజు గ్లాస్ లోనే టీ తాగుతామని అంటున్నారు.
ఇక పవన్ గెలుపుతో తన సొంత సినీ పరిశ్రమ నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు హీరోలు దర్శకులు పవన్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు. నాచురల్ స్టార్ నాని, రామ్ పోతినేని, మోహన్ బాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, హరీష్ శంకర్, రవితేజ,కాజల్, సుధీర్ బాబు, నట్టి కుమార్, కిరాక్ ఆర్ పి ఇలా పలువురు కంగ్రాట్స్ చెప్పిన వారిలో ఉన్నారు.
![]() |
![]() |