![]() |
![]() |
.webp)
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయిన ఓటీటీలోకి వచ్చాక అత్యధిక వీక్షకాధరణ పొందుతాయి. మరికొన్ని మిక్స్డ్ టాక్ తో ముగుస్తాయి. అలాగే గత నెలలో రిలీజైన మూవీ ' మిరల్ '.. మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి రానుంది. ఆఅ వివరాలేంటో ఓసారి చూసేద్దాం.
తాజాగా థియేటర్లలో రిలీజైన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ మిరల్. ఇప్పుడు తెలుగులో ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. నిజానికి నవంబర్, 2022లోనే తమిళంలో రిలీజైన ఈ సినిమా.. గత నెలలోనే తెలుగులోనూ రిలీజైంది. థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో మూడు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది.
ఈ సినిమాలో భరత్, వాణి భోజన్ ముఖ్య పాత్రలలో నటించారు. ఏడాదిన్నర కిందట తమిళంలో వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లు నిర్వహించినా సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. శక్తివేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గత నెల 17న తెలుగులోనూ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడా సినిమాకు ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. దీంతో మూడు వారాల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ నెల జూన్ 7 నుంచే 'మిరల్' సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ తెలిపింది. థియేటర్లలో అంతగా ఆడకపోయిన ఓటీటీ హక్కులను మాత్రం ఆహా పెద్ద మొత్తానికే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కె.ఎస్ రవికుమార్ కూడా ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించాడు.
![]() |
![]() |