![]() |
![]() |
.webp)
దారిన పోయే దాన్ని భుజాన వేసుకొవడం అనే సామెత ఇప్పుడు స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun)కి వర్తిస్తుంది. విభిన్నమైన నటనతో, డాన్సులతో, ఫైట్స్ తో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్న బన్నీ చేజేతులారా ఇమేజ్ కి డ్యామేజ్ తెచ్చుకుంటున్నాడేమో అని కూడా అనిపిస్తుంది.
మొన్న జరిగిన ఏ.పి ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి వైసిపీ పార్టీ తరుపున నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేసాడు. దీంతో బన్నీ నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ కి మద్దతు పలికాడు. అక్కడి ప్రజలని శిల్పా ని గెలిపించాలని కోరాడు. కానీ ఇప్పుడు శిల్పా ఓడిపోయే స్టేజ్ లో ఉన్నాడు. టిడిపి అభ్యర్థి గెలిచేలా ఉంది. దీంతో బన్నీ అభిమానుల్లో బెంగ మొదలయ్యింది.
అసలు నిజం చెప్పుకోవాలంటే బన్నీ ని ప్రచారానికి ఎవరు పిలవలేదు. ఈ విషయాన్ని అభ్యర్థి శిల్పా నే చెప్పాడు. కానీ బన్నీ నే అనవసరంగా వెళ్ళాడు. అతడు లో ఎం ఎస్ నారాయణ లాగా తన మానాన తాను మాడిపోయిన పెసరట్టు తినక అనవసరంగా వెళ్లాడని సోషల్ మీడియా లో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే శిల్పా ఓటమి పూర్తిగా అయిపోయాక బన్నీ మీడియాకి దొరుకుతాడా అని కూడా అంటున్నారు.
![]() |
![]() |