![]() |
![]() |

ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కలిపితేనే సినిమా. వాళ్ళల్లో ఎప్పుడు ఎవరి రేంజ్ ఏ స్థాయికి వెళ్తుందో చెప్పలేం. సింపుల్ గా చెప్పాలంటే టైం కోసం ఎదురుచూస్తుంటారు.టైం వచ్చాక టైం లేకుండా గడుపుతారు. అలాంటి వాళ్లలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్ కూడా ఒకడు.వర్సటైల్ యాక్టర్ గా తనదైన శైలిలో ముందుకు దూసుపోతున్నాడు. తాజాగా పుష్ప 2 గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు అవి ఆయన స్థాయిని తెలియచేస్తున్నాయి.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 2021 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ పుష్ప. ఇప్పుడు దానికి కొనసాగింపు గా పుష్ప 2 తెరకెక్కుతుంది.మొదటి భాగంలో నటించిన చాలా మంది సీక్వెల్ లో నటిస్తున్నారు.ఇప్పుడు ఈ విషయం మీదనే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అజయ్ ఘోష్ చెప్పిన మాటలు పలువుర్ని ఆలోచింపచేస్తున్నాయి. పుష్ప 2 లో నా పాత్ర లేదు.. నేను నటించలేక పోతున్నానే బాధ లేదు. ఎందుకంటే ఇంక నా సినీ కెరీర్ ఖతం అయ్యింది అనుకుంటున్న టైం లో పుష్ప వన్ లో అవకాశం వచ్చింది. అందులోని కొండా రెడ్డి పాత్ర నటుడుగా నాకు పునర్జన్మని ఇచ్చింది. ఆ సంతృప్తి చాలని చెప్పుకొచ్చాడు.
మొదటి భాగంలో కొండా రెడ్డి క్యారక్టర్ చనిపోతుంది. దీంతో ఆయన పార్ట్ 2 లో నటించే అవకాశం లేదు.సోషల్ మీడియా లో ఆయన ఇంటర్వ్యూ చూసిన చాలా మంది అజయ్ ఘోష్ పుష్ప 2 లో నటించాలని, వేరే క్యారక్టర్ కి తీసుకున్నా బాగుండేదని అంటున్నారు. ఏది ఏమైనా పుష్ప ఇచ్చిన ఉత్సాహంతో అజయ్ ఘోష్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వేరే నటుడి క్యారక్టర్ చూసి ఆ క్యారక్టర్ అజయ్ ఘోష్ చేస్తే బాగుండు అనే రేంజ్ కి కూడా వెళ్ళాడు. 2010 లో ప్రస్థానం తో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 40 సినిమాలకి పైనే చేసాడు. వాటిల్లో ఇతర బాషా చిత్రాలు కూడా ఉన్నాయి.
![]() |
![]() |