![]() |
![]() |
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇప్పటివరకు 14 సినిమాల్లో హీరోగా నటించారు. 15వ సినిమాగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ‘గేమ్‌ఛేంజర్’ రూపొందుతోంది. ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి ఏదో ఒక అవాంతరం రావడం, షూటింగ్ వాయిదా పడడం జరుగుతోంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి 30 రోజుల షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది. ఈ నెలలోనే చివరి షెడ్యూల్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నోసార్లు ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవుతూ వచ్చింది. ఈ చివరి షెడ్యూల్ కూడా అలాంటిదేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అదే జరిగితే సినిమా ఎప్పటికి పూర్తవుతుంది అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘ఆర్‌సి15’గా రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్ మూవీని 2021లోనే ఎనౌన్స్ చేశారు. 2023లో ‘గేమ్ ఛేంజర్’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఎంతోకాలంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా ఓ కొలిక్కి రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్ని చూస్తుంటే ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది రిలీజ్ అవుతుందా అనే డౌట్ కూడా వస్తోంది.
డైరెక్టర్ శంకర్ మాత్రం ‘ఇండియన్ 2’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి పెట్టారు. అంతేకాదు, ఈ సినిమాను ఎలా పబ్లిసిటీ చెయ్యాలనే విషయాలపై తీవ్రంగా చర్చిస్తున్నారు. వీటి వల్ల శంకర్ వల్లే ‘గేమ్‌ఛేంజర్’ ఆలస్యమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే రామ్‌చరణ్ వల్లే షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పలు కారణాలతో చరణ్ ఈ సినిమా షూటింగ్‌ని క్యాన్సిల్ చేశారనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే షూటింగ్ డిలే అవడానికి శంకరే కారణమనే అభిప్రాయంలో ప్రేక్షకులు, అభిమానులు ఉన్నారు. దానికి కారణం శంకర్ కాదన్న విషయం యూనిట్ సభ్యులకు తెలుసు కాబట్టి వస్తున్న విమర్శలను వారు అంతగా పట్టించుకోవడం లేదు.
ఈనెలలో చివరి షెడ్యూల్ పూర్తి చేస్తే మరో నెలరోజులు పోస్ట్ ప్రొడక్షన్‌కి కేటాయించాల్సి ఉంటుంది. ఆగస్ట్‌లో సినిమాను రిలీజ్ చెయ్యడానికి అవకాశం లేదు. ఎందుకంటే ‘పుష్ప2’ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. అంతేకాదు, మరి కొన్ని సినిమాలు ఆగస్ట్‌ను అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నాయి. ఇక మిగిలిన నాలుగు నెలల్లోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్‌కి ప్లాన్ చేసుకోవాలి. అయితే ఆ నాలుగు నెలల్లో కూడా కొన్ని భారీ సినిమాలు ఉన్నాయి. ‘దేవర’ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతోంది. తాజాగా సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రాన్ని కూడా అక్టోబర్ 10నే రిలీజ్ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఒక మాదిరి సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఇన్ని సినిమాల మధ్యలో చరణ్ సినిమాకు ఒక మంచి డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే కష్టంతో కూడుకున్న పనే. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి చూస్తే.. అలాంటి ఆలోచన ఏదీ లేదేమో అనే సందేహం కలుగుతోంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.. చరణ్ కొత్త సినిమాకి ఎప్పుడు మోక్షం లభిస్తుందో చూడాలి.
![]() |
![]() |