![]() |
![]() |
.webp)
రూమర్ కి గ్లామర్ ని తెచ్చే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినిమా ఫీల్డే.. ఇక్కడ పుట్టే ప్రతి రూమర్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. కాకపోతే ఆయా వ్యక్తుల్ని బట్టి అది చేసే షికారు ఆధారపడి ఉంటుంది. మరి తెలుగు సినిమాని విశ్వవ్యాప్తం చేసిన లెజెండరీ ఆఫ్ డైరెక్టర్ రాజమౌళి (rajamouli)మీద రూమర్ వస్తే.. షికారు లెవల్ ని అంచనా వెయ్యలేం.
జక్కన్న తన తదుపరి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu)తో చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా హీరోయిన్ గా నటించే అదృష్టం ఎవరని వరిస్తుందనే చర్చ కొంతకాలంగా నడుస్తుంది. చాలా రోజుల నుంచి రకరకాల హీరోయిన్ ల పేర్లు తెరమీదకి వచ్చాయి. వాటిల్లో చాలా బలంగా వినిపించిన పేరు జాన్వీ కపూర్(Janhvi Kapoor)శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ మహేష్ తో జోడి కట్టడం పక్కా అనే వార్తలు వచ్చాయి. చాలా మంది ఆ వార్త నిజం అని కూడా అనుకున్నారు.పైగా ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో మహేష్ కి జాన్వీ నే కరెక్ట్ జోడీ అని జక్కన్న భావిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ రూమర్స్ అని తెలుస్తుంది. 200 % జక్కన్న అండ్ టీం ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు.గతంలో హాలీవుడ్ హీరోయిన్ చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి.
కాకపోతే జాన్వీ కనుక మహేష్ తో జోడి కడితే సిల్వర్ స్క్రీన్ కి అంతకు మించి అదృష్టం లేదని చెప్పాలి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి ఎన్నో సినిమాల్లో జంటగా నటించి అశేష ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆ ఇద్దరిది సౌత్ చిత్ర పరిశ్రమ మొత్తంలోనే నెంబర్ వన్ హిట్ ఫెయిర్ కూడాను. మహేష్, జాన్వీ లు ఆ సంచలనాన్ని రీపీట్ చేయడానికి జక్కన్న మూవీ నాంది పలకాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జాన్వీప్రస్తుతం ఎన్టీఆర్ (ntr)దేవరతోను చరణ్ కొత్త మూవీలోను చేస్తుంది. ఇక జక్కన్న ప్రస్తుతం స్క్రిప్ట్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. తన ప్రతి కొత్త సినిమా తన పాత సినిమా రికార్డులని చెరిపేస్తుంది. మహేష్ మూవీ కూడా అదే విధంగా ఉండాలని ప్రతి అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.మహేష్ కూడా తన గెటప్ విషయం లో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శారీరకంగా మహేష్ జక్కన్న ల మూవీ షూటింగ్ ని జరుపుకోవడం లేదంతే. మానసికంగా మాత్రం ఇద్దరు మూవీ పనిలోనే ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తుండగా కీరవాణి సంగీత సారధ్యాన్ని వహిస్తున్నాడు.
![]() |
![]() |