![]() |
![]() |

ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'లవ్ మీ - ఇఫ్ యు డేర్' ( Love Me If You Dare). దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మే 25న థియేటర్లలో విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.
'లవ్ మీ' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా దక్కించుకుందట. థియేటర్లలో ఆదరణ లేకపోవడంతో.. వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని చూస్తున్నారట. జూన్ 15 లేదా జూన్ 22 నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం.
ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పి.సి.శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల, ఎడిటర్ గా సంతోష్ కామిరెడ్డి వ్యవహరించారు.
![]() |
![]() |