![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది.ఒక వైపు ఎలక్షన్స్ రిజల్ట్..ఇంకో వైపు సినిమాలు. పర్టిక్యులర్ గా సినిమాలని ఎందుకు అంటున్నానంటే.. హరిహరవీరమల్లు(hari hara veera mallu)ఓజి (og)ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)అనే సినిమాలని పవన్ స్టార్ట్ చేసాడు. ఈ మూడింటిలో ఓజి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది కానీ ఇప్పుడు బ్రేక్ పడనుంది.
అవును.. ఓజి కి బ్రేక్ పడనుంది. హరిహరవీరమల్లు.ఆ ప్లేస్ లోకి రాబోతుంది. రెండు సంవత్సరాల క్రితమే వీరమల్లు షూటింగ్ మొదలయ్యింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2020 లోనే స్టార్ట్ అయ్యింది. అంటే నాలుగు సంవత్సరాల పైనే అవుతుంది.ఈ మూవీ తర్వాత స్టార్ట్ అయిన ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ లు అయితే కొన్ని షెడ్యూల్స్ ని చాలా ఫాస్ట్ గానే పూర్తిచేసుకుంది. అది కూడా వీరమల్లుని పక్కన పెట్టి మరి. దీంతో మూవీ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. అభిమానుల్లో మొదలయిన కలవరాన్ని ప్రొడ్యూసర్ మీడియా ముందుకు వచ్చి పోగొట్టాడు ఎంటైర్ పవన్ కెరీర్ లోనే నెంబర్ వన్ మూవీగా వీరమల్లు నిలుస్తుందని చెప్పాడు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం పవన్ ఓజి ని పక్కన పెట్టి వీరమల్లు ని కంప్లీట్ చెయ్యబోతున్నాడు. కేవలం ఇరవై ఐదు రోజులు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. పవన్ ఆ మొత్తం రోజులుకి డేట్స్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. సో పవన్ ఫస్ట్ కొట్టే గుమ్మడికాయ వీరమల్లు నే.
.webp)
ఇప్పుడు ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ మాములుగా లేదు. ఎందుకంటే ఇప్పటి దాకా పవన్ ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ యూత్, లవ్ అండ్ కమర్షియల్ సినిమాలే. ఫస్ట్ టైం చారిత్రాత్మక మూవీ లో చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ అందరు చాలా గర్వంగా ఉన్నారు. ఓజి కి పదిహేను రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఇక వీరమల్లుకి డైరెక్టర్ మారిన విషయం తెలిసిందే. క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చి చేరాడు. దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే క్రిష్ చేస్తాడు. గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజెన్ మూవీకి జ్యోతి కృష్ణ నే దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ ఏఎంరత్నం భారీ బడ్జట్ తో నిర్మిస్తున్నాడు. వీరమల్లు ఆయన కలల ప్రాజెక్ట్ కూడాను.
![]() |
![]() |