![]() |
![]() |
.webp)
పాన్ ఇండియా ప్రేక్షకుల కట్టప్ప సత్యరాజ్. మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా రాణించి సెకండ్ ఇన్నింగ్స్ లో వర్సటైల్ యాక్టర్ గా అశేష ప్రేక్షకుల అభిమాన నటుడుగా మారాడు. లేటెస్ట్ గా వెపన్ అనే మూవీతో వస్తున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తి కరమైన విషయాల్ని వెల్లడించాడు.
వెపన్ మూవీ జూన్ 7 న విడుదల కానుంది.ఇందులో 28 ఏళ్ళ వయసున్న వ్యక్తిగా సత్య రాజ్ కనిపించబోతున్నాడు. ఏఐ టెక్నాలజీ ని ఉపయోగించి ఆ విధంగా చూపిస్తున్నారు. ఇక సత్య రాజ్ మాట్లాడుతూ వెపన్ ఖచ్చితంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని చెప్పాడు. అదే విధంగా దర్శక ధీరుడు రాజమౌళి గురించి కూడా మాట్లాడాడు. బాహుబలి లో కట్టప్ప క్యారక్టర్ ని ఇచ్చిన రాజమౌళికి జీవింతాంతం రుణపడి ఉంటాను. అదే విధంగా రాజమౌళి మహేష్ మూవీ లో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.కానీ ప్రస్థుతానికి రాజమౌళి టీం నన్ను సంప్రదించలేదని చెప్పాడు. అలాగే గత కొన్ని రోజులుగా ప్రధాన మంత్రి మోదీ బయోపిక్ లో నటిస్తున్నానే వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదని కూడా చెప్పాడు. సత్య రాజ్ వయసు ప్రస్తుతం 68 .

మిలియన్ స్టూడియో బ్యానర్ పై ఎం ఎస్ మన్జూర్ సమర్పణలో వెపన్ తెరకెక్కింది. జైలర్ లో రజనీకాంత్ కొడుకుగా చేసిన వసంత్ రవి, తాన్యా హోప్, మీమీ గోపి, రాజీవ్ మీనన్, షియాస్ కరీం, తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించగా గుహన్ సెన్నియప్పన్ దర్శకుడు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
![]() |
![]() |