![]() |
![]() |

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఉరఫ్ కేసిఆర్ (kcr) సినిమాలకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అరుదు. ఆయన చేతుల మీదుగా తమ సినిమా ప్రమోషన్స్ జరగాలని చాలా మంది సినిమా వాళ్ళు భావిస్తారు. తద్వారా తమ సినిమాకి తిరుగుండదనేది వాళ్ల నమ్మకం. పైగా ఆయన చేతికి చాలా లక్కీ హ్యాండ్ అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఆ లక్కీ హ్యాండ్ రాకింగ్ రాకేష్ ని వరించింది.
జబర్దస్త్ ద్వారా ప్రేక్షకాభిమానాన్ని పొందిన నటుడు రాకింగ్ రాకేష్ (rocking rakesh) ఇప్పుడు ఆయన హీరోగా కేసిఆర్ (kcr)అనే టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కుతుంది. కేసిఆర్ అంటే కేశవ చంద్ర రమావత్. ఈ మూవీకి సంబంధించిన ఒక పాటని కేసిఆర్ విడుదల చేసారు. తెలంగాణ తేజం అనే పల్లవి తో స్టార్ అయ్యింది. హైదరాబాద్ నంది నగర్ లోని తన నివాసంలో ఆ పాటని ఆవిష్కరించారు. ప్రముఖ సినీ,విప్లవ గేయ రచయిత గోరటి వెంకన్న సాహిత్యాన్ని అందించాడు. మను కల్పనా తో కలిసి గోరటి నే ఆలపించాడు. చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించాడు.
.webp)
ఇక పాట విన్న కేసిఆర్ టీం మొత్తానికి తన అభినందలు తెలిపారు.అలాగే రాకింగ్ రాకేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.రాకింగ్ రాకేష్ సతీమణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంది.ఎంపీ దీవకొండ దామొదర్ రావు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్,ఎమ్మెల్సీ,మాజీ స్పీకర్ మధుసుధనా చారి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,బీఆర్ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. గరుడ వేగా అంజి దర్శకుడు కాగా రాకింగ్ రాకేష్ నే నిర్మాత.
![]() |
![]() |